కరోనాకు వ్యాక్సిన్ రెడీ
- July 12, 2020
రష్యా:ప్రపంచాన్ని ఆరునెలలకు పైగా కరోనావైరస్ మహమ్మారి వణికిస్తూనే ఉంది. దీని కారణంగా 12 మిలియన్ల మంది కరోనా భారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 500,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, ఈ తరుణంలో ప్రపంచంలోని మొట్టమొదటి కరోనావైరస్ వ్యాక్సిన్ యొక్క క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. రష్యా లోని సెచెనోవ్ మెడికల్ యూనివర్శిటీలో కరోనా వ్యాక్సిన్‌కు విజయవంతంగా ట్రయల్స్ పూర్తయ్యాయని ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ వాడిమ్ తారాసోవ్ తెలిపారు.
దీంతో కరోనావైరస్ కు వ్యతిరేకంగా ప్రపంచంలోని మొట్టమొదటి టీకా వాలంటీర్లపై సెచెనోవ్ విశ్వవిద్యాలయం విజయవంతంగా పరీక్షలను పూర్తి చేసింది అని తారాసోవ్ చెప్పారు. రష్యన్ వార్తా సంస్థ స్పుత్నిక్ వెల్లడించిన వివరాల ప్రకారం, పరీక్షల్లో పాల్గొన్న మొదటి వాలంటీర్ల సమూహం జూలై 15 న , రెండవ సమూహం జూలై 20 న విజయవంతంగా డిశ్చార్జ్ కానున్నారు. రష్యాకు చెందిన గమలీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ ఉత్పత్తి చేసిన టీకా యొక్క క్లినికల్ ట్రయల్స్ జూన్ 18 న విశ్వవిద్యాలయం ప్రారంభించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు