పాటతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న 'ఒరేయ్ బుజ్జిగా'
- July 18, 2020
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న యూత్ ఎంటర్టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా...`. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం నుండి `కలలు చూసినా కన్నులే` లిరికిల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
కలలు చూసినా కన్నులే నేడు మోసెనే కన్నీల్లే... హాయి పంచినా గుండెకే ఓ గాయమయ్యెనే..ఓహో జంట నడిచినా అడుగులే ఒంటరయ్యనే ఇవ్వాలే..వెలుగు నిచ్చినా నీడకే మిగిలింది చీకటే..అంటూ
అర్దవంతంగా మనసుకు హత్తుకునే ఈ విరహగీతాన్ని కాసర్ల శ్యామ్ రాయగా లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ అంతే అద్భుతంగా ఆలపించారు. యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మ్యాజికల్ ట్యూన్స్ పాటను మరో రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఈ పాట విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని పాటలు విడులదవుతున్నాయి.
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డాన్స్: శేఖర్, ఆర్ట్: టి.రాజ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







