ఈ ప్రత్యేకమైన రోజుని ఎప్పటికి మర్చిపోలేను:యష్
- July 19, 2020
కెజిఎఫ్ - చాప్టర్1 సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న కన్నడ హీరో యశ్ తొలి చిత్రం మొగ్గిన మనసు విడుదలయి ఈ జులై 18కి పన్నెండేళ్ళు పూర్తయింది. ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే-యశ్ రాధికా పండిట్ కూడా ఈ సినిమాతోనే పరిచయమయ్యారు.
2008లో విడుదలయిన మొగ్గిన మనసు సినిమా రొమాంటిక్ డ్రామా.యశ్, రాధికా పండిట్ కలిసి నటించిన ఈ సినిమాకి శశాంక్ దర్శకుడు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కావడంతో పాటు మంచి పేరు తెచ్చుకుంది.
ఆ తర్వాత యశ్ మొదల సాల, రాజధాని, కిరాతక, డ్రామా, గజకేసరి, గూగ్లీ, రాజాహులి సినిమాలతో పాపులర్ అయ్యారు. మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో కూడా రాధికా పండిట్ హీరోయిన్ కావడం విశేషం. ఆ తర్వాత కెజిఎఫ్ చాప్టర్1 సినిమాతో ఆలిండియా స్టార్ అయ్యారు. కెజిఎఫ్ చాప్టర్2 సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మొగ్గిన మనసు సినిమా లో యష్ రాధికా పండిట్ హీరోయిన్ గా నటించారు.ఇదే రాధికా పండిట్ తోలి సినిమా. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం ప్రేమ గా మారి పెళ్లి చేసుకున్నారు.
ఈ సందర్భంగా యష్ మాట్లాడుతూ " ఈ ప్రత్యేకమైన రోజు ని ఎప్పటి కి మర్చిపోలేనని . ఒక స్క్రాప్ నుంచి తారాస్థాయికి వచ్చానని యష్ అన్నారు. అలాగే కెజిఎఫ్ చాప్టర్ -2 షూటింగ్ కొంత బ్యాలెన్స్ వర్క్ వుందని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తానని అన్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







