పోలీసులు అజీజ్‌ను నేడు కోర్టులో హాజరుపరుచనున్నారు
- February 04, 2016
నేడు కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు లక్నోలో పట్టుబడిన ఉగ్రవాది అబ్దుల్ అజీజ్‌ను గురువారం రాష్ట్ర పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. పోలీసులు అజీజ్‌ను శుక్రవారం కోర్టులో హాజరుపరుచనున్నారు. భవానీనగర్‌కు చెందిన అబ్దుల్‌అజీజ్ 12 ఏండ్లుగా సౌదీఅరేబియాలో ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. ఇతడిపై హైదరాబాద్ ఆలయం పేల్చివేతకు కుట్రతోపాటు నకిలీపాస్‌పోర్టు కేసు కూడా నమోదై ఉంది. ఈ కేసులు నమోదైన తర్వాత 2004లో సౌదీఅరేబియాకు పారిపోయాడు. అప్పటినుంచి పోలీసులు ఇతడి కోసం గాలిస్తున్నారు. సౌదీఅరేబియాలో ఉన్న అజీజ్‌ను ఇంటర్‌పోల్ సహాయంతో దేశానికి రప్పించారు. మంగళవారం లక్నో చేరుకున్న ఇతడిని అక్కడి యాంటీ టెర్రరిస్టు స్కాడ్ అదుపులోకి తీసుకుంది.ఆ తర్వాత హైదరాబాద్ పోలీసులు అక్కడి కోర్టు అనుమతితో గురువారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కోర్టులో రిమాండ్ అనంతరం తిరిగి విచారణ నిమిత్తం కోర్టు అనుమతి అదుపులోకి తీసుకోనున్నట్టు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (సిట్) పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







