ముఖ్యమంత్రి చంద్రబాబు అమర వీరులకు నివాళి

- February 04, 2016 , by Maagulf
ముఖ్యమంత్రి  చంద్రబాబు అమర వీరులకు నివాళి

 భారత్-పాక్ యుద్ధంలో మరణించిన అమరవీరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నివాళులు అర్పించారు. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధంలో భారత నౌకాళదానికి చెందిన పలువురు ప్రాణాలు అర్పించారు. ఇందుకు చిహ్నంగా విశాఖ బీచ్ రోడ్డులో విక్టరీ ఎట్ సీ పేరుతో స్మారక స్థూపాన్ని నిర్మించారు. విశాఖలో జరుతుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లో మొదటి కార్యక్రమంగా అమర వీరులకు చంద్రబాబు నివాళులు అర్పించారు. సాయం త్రం నాలుగు గంటలకు అమర వీరుల స్థూపం వద్ద చంద్రబాబు పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులు అర్పించారు. 50 మంది సాయుధ నౌవికాదళ సైనికులు స్లో మార్చ్ చేస్తూ చంద్రబాబుని అమరవీరుల స్థూపం వద్దకు తీసుకువచ్చారు.చంద్రబాబు నివాళులు అర్పించినప్పుడు సైనికులు సంప్రదాయ బద్ధంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నౌకాదళ ప్రధాన అధికారి ఆర్‌కె థావన్, తూర్పు నౌకాదళ అధికారి సతీష్ సోనీ పాల్గొన్నారు.అమరవీరుల స్థూపం వద్దపుష్పగుచ్ఛం ఉంచుతున్న ఏపిముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబ్బురపరిచిన విన్యాసాలుకన్నుల పండువగా సిటీ పెరేడ్ విజయవంతంగా ఐఎఫ్‌ఆర్ తుది రిహార్సల్స్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లో భాగంగా 7వ తేదీన జరిగే ప్రధాన విన్యాసాల తుది రిహార్సల్స్ గురువారం సాయంత్రం విశాఖ ఆర్‌కె బీచ్‌లో కన్నుల పండువగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆదివారం సాయంత్రం జరగనున్న ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆర్‌కె బీచ్ వేదికగా నౌకాదళ విన్యాసాలు నిర్వహించారు. నౌకాదళ ప్రధానాధికారి ఆర్‌కె ధావన్ ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ దేశాల నౌకాదళ ప్రతినిధుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకల ప్రదర్శన, యుద్ధ విమానాల విన్యాసాలను పౌరులు ఆసక్తిగా తిలకించారు. స్వీడన్‌కు చెందిన స్కాండినేవియన్ వింటేజ్ విమానాలు గగనతలంలో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. స్కై గ్లైడర్స్ విన్యాసాలు అబ్బురపరిచాయి. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీకి గౌరవ వందనం చేస్తూ సాగే సిటీ పెరేడ్ అబ్బురపరుస్తూ సాగింది. సుమారు 52 దేశాలకు చెందిన నౌకాదళ ప్రతినిధులు హాజరవుతున్న ఐఎఫ్‌ఆర్‌లో సన్నాహక పెరేడ్‌లో 21 దేశాలకు చెందిన నౌకాదళ బృందాలు పాల్గొన్నాయి.పెరేడ్‌లో 52 దేశాలకు చెందిన ప్రతినిధులు తమ జాతీయ పతాకాలతో ముందు కవాతు ప్రారంభించగా, గూర్ఖా రైఫిల్స్ బ్యాండ్ ముందు నడవగా, భారత నౌకాదళం, భారత వాయుసేన, కోస్ట్‌గార్డ్స్, ఎపి పోలీస్, విశ్రాంత నేవీ సిబ్బంది బృందం, ఎన్‌సిసి, కోరుకొండ సైనిక్ స్కూల్, ఎన్‌సిసి బృందాలు ప్రధానికి వందనం చేస్తూ ముందుకు సాగాయి.అనంతరం ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొంటున్న ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, జపాన్, ఇరాన్, ఇండోనేసియా, మలేసియా, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, రష్యా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, థాయ్‌లాండ్, సీషెల్స్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా, వియత్నాం దేశాలకు చెందిన ప్రతినిధులు సిటీ పెరేడ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. చివరగా కళ్లు మిరుమిట్లు గొలిపే విధంగా బాణసంచా కాల్పులు అబ్బురపరిచాయి.రంగులు వెదజల్లుతున్న స్కాండినేవియన్ విమానాలు. సముద్రాన్ని తాకేలా విమాన విన్యాసాలు. పారాచ్యూట్‌తో విన్యాసాలు చేసిన రైడర్లుహైదరాబాద్‌లోతోషిబా పెట్టుబడులుట్రాన్స్‌ఫార్మర్ల ఫ్యాక్టరీ విస్తరణ యోచన. హైదరాబాద్‌లో ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఫ్యాక్టరీ విస్తరణకు 30 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు తోషిబా ట్రాన్స్‌మిషన్ సిస్టమ్స్ ప్రకటించింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ట్రాన్స్‌ఫార్మర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఫ్యాక్టరీని విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ కత్సూటోషి తోడా తెలిపారు. కొత్త టెక్నాలజీతో గ్యాస్ ఇన్సులేటడ్ స్విచ్‌గేర్లను తయారు చేస్తామన్నారు. మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా తాము ఈ సంస్థను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. డిజైన్, టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్‌లో భారత్ పరిజ్ఞానాన్ని, సేవలను ఈ ఫ్యాక్టరీలో వినియోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. తమ సంస్థ చిన్న, మధ్యతరహా హైవోల్టేజి ట్రాన్స్‌ఫార్మర్లను తయారు చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో భారత్ ట్రాన్స్‌ఫార్మర్ల మార్కెట్‌లో 20 శాతం వాటాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com