గెలుపుతో తెరాస కొత్త చరిత్రకు శ్రీకారం
- February 05, 2016
తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించామని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ గొప్ప గెలుపుతో తెరాస కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ అపూర్వ విజయం అందించిన ప్రజలకు శిరస్సు వంచి వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీని చిత్తశుద్ధితో అమలుచేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టంచేశారు. ఈ గెలుపుతో తెరాస అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిందన్నారు.ఈ ఎన్నికల్లో గెలుపునకు కృషిచేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అన్నింటికీ మించి అఖండమైన రీతిలో ప్రజలు తమను ఆదరించినందునే ఈ విజయం సాధ్యమైందన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేశామన్నారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







