'స్మార్ట్' యోగా

- May 24, 2015 , by Maagulf
'స్మార్ట్' యోగా

ఉండేలా తల ఉన్నప్పుడు - మీ తల సుమారు 4.5 కేజీల బరువు ఉంటుంది. మీ తలను ముందుకు వంచినపుడు, అలా వంగే ప్రతీ అంగుళానికీ మీ వెన్నెముకపై కలిగే ఒత్తిడి రెట్టింపు అవుతూ పోతుంది. కాబట్టి మీరు మీ స్మార్ట్ ఫోన్ నో, లేదా ట్యాబ్ నో ఉపయోగిస్తున్నపుడు మీ మెడ 10 నుండి 14కేజీల బరువు మోస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ అధికఒత్తిడి మీ వెన్నెముకను అదికంగా సాగదీసి సమతుల్యతను కోల్పోయేలా చేయవచ్చు. ఒక్క క్షణం! మిమ్మల్ని నిరుత్సాహపరచి ఈ పరికరాల్ని వాడవద్దని చెప్పటం మా ఉద్దేశం కాదు. మనలో ప్రతీ ఒక్కరి జీవితాన్నీ ఈ బుల్లిబుల్లి పరికరాలు ఎంతో సౌకర్యవంతంగా చేస్తున్నాయి. అయితే వాటి వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలను దూరంగా ఉంచటానికి కొన్ని చిట్కాలు సహాయపడతాయి. కొన్ని చక్కని యోగా సూత్రాలు మీకెలా సహాయపడతాయో ఇపుడు చూద్దాం. బలంగా ఉండి, సులభంగా వంగగలిగే వెన్ను, మెడభాగాలు మనకు అధిక ఒత్తిడిని తట్టుకోవటంలో సహాయపడి, మొబైల్ ఫోన్ తరచుగా వాడటంవల్ల కలిగే నొప్పులను తగ్గిస్తాయి. ఇక్కడ చెప్పబడిన యోగ వ్యాయామాలు వెన్నుకు,మెడ కండరాలకు బలాన్ని, విశ్రాంతిని ఇస్తాయి. వీటిని నిత్యమూ సాధనచేస్తూ ఉంటే మీ కిష్టమైనవారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు హటాత్తుగా మెడ పట్టేయడం లాంటి ఇబ్బందులనుండి తప్పించుకోవచ్చు!! చెవి తమ్మెల మర్దనా: చెవుల పైభాగం నుండి మొదలుపెట్టి తమ్మెల వరకూ నొక్కండి. ఒకటి రెండు సార్లు తమ్మెలను కిందకు లాగండి. చెవులను సవ్య దిశలోనూ, అపసవ్యదిశలనూ కొద్దిసార్లు త్రిప్పటంవలన చెవుల చుట్టూ ఉండే ఒత్తిడి దూరమవుతుంది. చెతులను సాగదీయండి: అరచేతులను ఆకాశంవైపు ఉండేలా చేతుల్ని పైకి చాపండి. అలా చేతుల్ని సాగదీయండి. అక్కడినుండి నెమ్మదిగా చేతుల్ని రెండు పక్కలకూ చాపి, వేళ్ళను అటూఇటూ ఊపుతూ మీ భుజాలు, మోచేతులలోని ఒత్తిడికి టాటా చెప్పేయండి. భుజాలను గుండ్రంగా తిప్పండి: మోచేతులను పక్కకు చాపి ఉంచండి. బొటనవేలిని చిటికెనవేలి మొదట్లో ఉంచండి. ఇప్పుడు చేతులను కదపకుండా భుజాలనుమాత్రం సవ్యదిశలో 5 సార్లు, అపసవ్యదిశలో 5 సార్లు తిప్పండి. అరచేతులను వత్తండి: అరచేతులను ఛాతీకి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లుగా ఉంచండి. భుజాలను స్థిరంగా ఉంచి, అరచేతులను ఒకదానికొకటి గట్టిగా వత్తి, మరలా వదులు చేయండి. ఇలా రెండుసార్లు చేసినాక, అరచేతులను వెనక్కు తిప్పిమరలా రెండుసార్లు చేయండి. మోచేతులతో ఎనిమిది అంకె: అరచేతులను ఛాతీకి ఎదురుగా ఉంచి, మొబైల్ ఫోన్ వాడటం వలన మీకు మెడనొప్పివస్తోందా? లేక తలనొప్పి? లేదా భుజాలనొప్పి? ఈనాటి అత్యాధునిక టెక్నాలజీ యుగంలో మొబైల్ ఫోన్ అనేది ప్రపంచమంతటా అత్యధికంగా వాడబడుతున్న తనటంలో అతిశయోక్తి లేదు. చదువునుండి ఆరోగ్యందాకా, మానవ సంబంధాలనుండి వ్యాపారందాకా, మొబైల్ ఫోన్లు ప్రపంచాన్ని సమూలంగా మార్చివేస్తున్నాయి. అయితే అతిగా మొబైల్ ఫోన్లను వాడటం వల్ల జీవనశైలిలో వచ్చే ఇబ్బందులూ పెరిగాయి. ఉదాహరణకు మీరు ఈ వ్యాసాన్ని మీ మొబైల్ లో చదువుతున్నారనుకోండి, మీ మోచేతులు శరీరానికి రెండుపక్కలా వంగి ఉన్నాయి, వెన్ను వంగి ఉంది, మెడ కొంచెం ముందుకు వంగి, తలను నిలబెడుతోంది, అవునా? ఈ భంగిమలో ఉండటం, మీరు గమనించినా, లేకున్నా సరే మీకు బహుశా నొప్పిని కలిగిస్తూ ఉండవచ్చు. ఇది వైద్య పరిభాషలో 'టెక్స్ట్ నెక్' అని పేర్కొనే ఆరోగ్య విపరిణామానికి దారితీయవచ్చు. టెక్స్ట్ నెక్ అనేది ఒక జీవనశైలి సమస్య. ఎక్కుసేపు ముందుకు వంగిన భంగిమలో గడిపేవారికి మెడ, వెన్నులో వచ్చే నెప్పి ఇది. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, -బుక్ రీడర్లు అతిగా వాడటంవలన ఇది రావచ్చు. మీ తల సాధారణంగా స్థిరంగా ఉన్నపుడు - అంటే మీ చెవులు మీ భుజాలకు పైగా వేళ్ళను పెనవేయండి. ఇపుడు అరచేతులను ఛాతీకి ఎదురుగా ఉంచి మోచేతులను, భుజాలను నీటి అలలవలే కదుపుతూ (కిందకు వాలి ఉన్న ఎనిమిది) అంకె ఆకారంలో తిప్పండి. భుజాలను సాగదీయండి: కుడిచేతిని తలపై పెట్టుకోండి. ఎడమచేత్తో ఎడమమోకాలిని గట్టిగా అదిమి ఉంచండి. ఇప్పుడు ఎడమచేతిని అలాగే కదపకుండా ఉంచి, కుడి చేయిని అన్నివైపులా తిప్పుతూ మీ పిరుదులకు తగిలేలా తీసుకువచ్చి, మరలా పైకెత్తండి. ఇలా కొద్దిసార్లు చేసినాక, చేతులు మార్చి మరలా చేయండి. వేళ్ళకు మర్దనా: బొటనవేళ్ళను ఛాతీకి ఎదురుగా తెచ్చి, రెండువైపులా గుండ్రంగా కొద్దిసార్లు తిప్పండి. అన్నివేళ్ళనూ ఒకసారి దగ్గరగా అదిమి, వదలండి. ఇలా రెండుసార్లు చేయండి. నొప్పిని ఎదుర్కొనటానికి ఈ యోగాసనాలను చేస్తున్నపుడు, ఈ కింది విషయాలను మరిచిపోవద్దు: మీరు మొబైల్ వాడే భంగిమను మార్చుకోండి: మీ చరవాణిని ఒడిలో పెట్టుకుని, వంగి లేదా తల కిందకు వంచి చూస్తూ ఉంటే, ఆ ఫోన్ ను లేదా ట్యాబ్ ను నిటారుగా, కంటి చూపుకు సమానమైన ఎత్తులో ఉండేలా పెట్టుకొనే విధానాన్ని ఎంచుకోండి. మధ్యలో విరామం తీసుకోండి: మీ చరవాణిని రోజంతా వాడుతున్నారని గుర్తుంచుకోండి. బలవంతంగానైనా మధ్యమధ్య కొంతసేపు విరామం తీసుకుని మీ భంగిమను మార్చుకోండి. సులభమైన ఈ యోగా వ్యాయామాలను సాధనచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, స్మార్ట్ ఫోన్ యోగిగా మారిపోండి!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com