‘ఎంజాబ్స్ యాప్’కి అద్భుతమైన స్పందన
- May 24, 2015
దుబాయ్ స్మార్ట్ గవర్నమెంట్ (డిఎస్జి) ఏప్రిల్ 27న ప్రారంభించిన ‘ఎంజాబ్స్’ యాప్‌కి విశేషమైన స్పందన లభించింది. కేవలం మూడు వారాల్లోనే 15 వేల 700 మంది యూజర్స్ ఈ యాప్‌ని ఉపయోగించుకున్నారు. మొత్తం 67 వేల 740 ఆపరేషన్స్ ఈ యాప్ ద్వారా జరిగాయి. 3 వేల మంది ఈ యాప్‌లో జాబ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 12 వేల 700 మంది ప్రకటితమైన ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ యాప్ ద్వారా. ఉద్యోగాల ప్రకటనల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఈ యాప్ ఎంతో ఉపకరిస్తోంది. ఉద్యోగాల్ని ఆశిస్తున్నవారు, ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న కంపెనీలు ఈ యాప్‌ని వేదికగా చేసుకోవడం వల్ల ‘ఉద్యోగార్జన, ఉద్యోగాల కల్పన’ కూడా ఎంతో వేగంగా జరుగుతోందని డిఎస్జి డైరెక్టర్ జనరల్ అహ్మద్ బిన్ హుయాయిదన్ చెప్పారు. ఆండ్రాయిడ్ వెర్షన్ యాప్ డెవలప్మెంట్ స్టేజ్‌లో ఉందని, త్వరలోనే దాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







