75 మంది ఉగ్రవాదులు హతo...
- February 09, 2016
ఇరాక్‌లో ఉగ్రవాద ప్రభావిత ప్రాంతమైన రమాదిలో సోమవారం 75 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భద్రతాదళాలు వెల్లడించాయి. రమాదిలో ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న రెండు ప్రాంతాలను ఇరాక్ ప్రభుత్వ భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. రమాదికి పది కిలోమీటర్ల దూరంలో హుసైబా అల్-షర్ఖియా ప్రాంతంలో భద్రతాదళాలు ఉగ్రవాదులతో పోరాడాయి. అయిదుగురు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. దాదాపు 43 మంది మరణించగా, ఏడుగురు ఉగ్రవాదులు ప్రాణాలతో పట్టుబడ్డారు. నలుగురు భద్రతా సిబ్బంది మరణించగా, 12 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.రమాది తూర్పు ప్రాంతంలోని జువిబాలో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో 25 మంది ఉగ్రవాదులు హతం కాగా, ఎనిమిది మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పోరాటం తర్వాత జువిబా జిల్లాలో పలు భవనాలపై ఇరాక్ దేశ జెండాను ఎగురవేశారు. రమాది నగరాన్ని ఐఎస్ ఉగ్రవాదులు గత ఏడాది స్వాధీనం చేసుకున్నారు. దానిని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







