‘కామిక్‌స్టాన్’ యొక్క తమిళ వెర్షన్ అయిన కామిక్స్టాన్ సెమ్మా కామెడీ పాట విడుదల

- September 03, 2020 , by Maagulf
‘కామిక్‌స్టాన్’ యొక్క తమిళ వెర్షన్ అయిన కామిక్స్టాన్ సెమ్మా కామెడీ పాట విడుదల

అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క అత్యంత విజయవంతమైన అన్‌స్క్రిప్టెడ్ కామెడీ ఫ్రాంచైజ్ ‘కామిక్‌స్టాన్’ యొక్క తమిళ వెర్షన్ అయిన కామిక్స్టాన్ సెమ్మా కామెడీ పా ను విడుదల చేసింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క పాపులర్ స్టాండ్ అప్ కామెడీ ఫార్మాట్ కామిక్‌స్టాన్ హిందీలో 2 విజయవంతమైన సీజన్లు పూర్తి చేసుకున్న తర్వాత తమిళ అనుసరణను పొందనుంది.

తదుపరి ఉత్తమ తమిళ స్టాండ్అప్ కమిడియన్ ను కనుగొనేందుకు ప్రవీణ్ కుమార్, కార్తీక్ కుమార్ మరియు రాజ్‌మోహన్ వంటి ప్రముఖ హాస్యనటులు 8 ఎపిసోడ్లలో పోటీదారులకు మార్గదర్శకత్వం మరియు తీర్పు ఇవ్వనున్నారు.

   సరికొత్త మరియు ప్రత్యేకమైన చలనచిత్రాలు, టీవీ షోలు, స్టాండ్-అప్ కామెడీ, అమెజాన్ ఒరిజినల్స్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ద్వారా ప్రకటన-రహితంగా మ్యూజిక్ వినడం కోసం, భారతదేశపు అతిపెద్ద ఉత్పత్తుల ఎంపికపై ఉచిత, వేగవంంతమైన డెలివరీ, టాప్ డీల్స్ యాక్సెస్, ప్రైమ్ రీడింగ్‌తో అపరిమితమైన పఠనం మరియు ప్రైమ్ గేమింగ్‌తో మొబైల్ గేమింగ్ కంటెంట్ అమెజాన్ ద్వారా పొందవచ్చు. ఇవన్నీ కేవలం నెలకు 129 రూపాయల అద్భుతమైన విలువతో ప్రైమ్ మీకోసం అందిస్తుంది.

ముంబై, ఇండియా, 2020 సెప్టెంబర్ 3 - అమెజాన్ ప్రైమ్ వీడియో ఈరోజు కామిక్‌స్టాన్ సెమ్మా కామెడీ పా యొక్క ట్రైలర్‌ను విడుదల చేసింది, ఇది ప్రేక్షకుల యొక్క అభిమాన అమెజాన్ ఒరిజినల్ సిరీస్ అయిన కామిక్‌స్టాన్ యొక్క తమిళ వెర్షన్. ప్రైమ్ వీడియో ప్రారంభిస్తున్న ఈ ధారావాహిక యొక్క అనుసరణ తమిళ భాషలో ఒరిజినల్ కంటెంట్‌ని సూచిస్తుంది. సరికొత్త ధారావాహికలో, తమిళంలో టాప్లో ఉన్న, కామెడీ రంగంలోని నిపుణులు ముగ్గురు హాస్యనటులు ప్రవీణ్ కుమార్, కార్తీక్ కుమార్ మరియు రాజ్మోహన్ అరుముగం, తమిళ స్టాండ్ అప్ సీన్ లో కామెడీ రాజుగా లేదా కామెడీ రాణిగా మారడానికి పోటీపడే మెంటర్ ఎంపిక చేసిన పోటీదారులను చూస్తాము. ఓన్లీ మచ్ లౌడర్ (OML) ఎంటర్టైన్మెంట్ చేత సృష్టించబడిన, ఎయిట్-ఎపిసోడ్ అమితంగా విలువైన సిరీస్ వీడియో స్ట్రీమింగ్ సేవలో తమిళ భాషలో ఇదే మొదటిది. లోకల్ ఫ్లావర్ జోడించి, ఈ ప్రదర్శనను డైనమిక్ డుయో విద్యూలేఖ రామన్ & మెర్విన్ రోజారియోలు నిర్వహిస్తున్నారు. ఉత్తేజకరమైన కొత్త అన్‌స్క్రిప్టెడ్ కామెడీ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 11 న ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు మరియు టెర్రిటోరియస్ లో ప్రత్యేకంగా ప్రారంభించబడుతుంది.

ఒక కళా ప్రక్రియగా కామెడీ తమిళ ప్రేక్షకులకు కొత్త కాదు, ఈ ప్రదర్శన యొక్క ఫార్మాట్ లేటెస్టుగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రేక్షకులతో సన్నిహితంగా ఉండటానికి స్టాండ్-అప్ కామెడీ వంటి తరంలో ‘పోటీ’ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. కామిక్‌స్టాన్ సెమ్మా కామెడీ పా లో లోకల్ ఫ్లావర్ తెస్తుందని, తమిళ సంస్కృతి యొక్క ప్రత్యేకమైన సూక్ష్మ నైపుణ్యాల నుండి సంభాషణలు తీసుకోవడం, పాల్గొనే ప్రతి ఒక్కరూ ప్రదర్శించే ప్రత్యేకమైన సెట్‌లతో ఈ షో అందరిని అలరిస్తుంది అని భావిస్తున్నారు. ఈ ట్రైలర్ సరికొత్త ఎడిషన్‌లోకి ప్రవేశిస్తుంది, ఇక్కడ ఆరుగురు తమిళ కామెడీ ఉత్తమ పోటీదారులు కామిక్‌స్టాన్ సెమ్మా కామెడీ పా విజేత టైటిల్ కోసం పోటీపడబోతున్నారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్స్ ఇండియా హెడ్ అపర్ణ పురోహిత్ మాట్లాడుతూ, “ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మేము విడుదల చేసే స్క్రిప్ట్ లేదా అన్‌స్క్రిప్టెడ్ సిరీస్ లేదా సినిమాలు ఏదయినా, స్థానిక సంబంధిత కంటెంట్ కలిగి ఉంటే మా వినియోగదారులచే ఎల్లప్పుడూ ప్రశంసించబడుతుంది; అందువల్ల మా మొట్టమొదటి అన్‌స్క్రిప్టెడ్ ఒరిజినల్ సిరీస్, కామిక్‌స్టాన్ సెమ్మా కామెడీ పా. అమెజాన్ ప్రైమ్ వీడియో ఎల్లప్పుడూ వారి ప్రేక్షకుల కోసం కొత్త మరియు తెలివిగల కంటెంట్‌ను సృష్టించాలని చూస్తోంది, మరియు కామిక్‌స్టాన్ కూడా అటువంటి సిరీస్, ఇక్కడ హాస్యనటులు కామిక్‌స్టాన్ టైటిల్ విజయం సాధించటానికి పోరాడుతారు. కామిక్‌స్టాన్ యొక్క మొదటి రెండు సీజన్లలో ప్రేక్షకుల నుండి అపారమైన ప్రేమ లభించింది, వాస్తవానికి, ఇది యువతకు స్టాండప్ కామెడీని ఆకాంక్షించింది. ఇది విజేతలను ప్రారంభించడమే కాక, చాలా మంది ప్రతిభావంతులైన పోటీదారులకు విజయవంతమైన ప్రేరణగా మారింది! మా తమిళ ప్రేక్షకులను ఆకర్షించడానికి స్థానిక సాంస్కృతిక స్వల్పభేదాల నుండి సంఘటనలను  తీసుకొని, తమిళంలో ప్రత్యేకంగా నిర్మించిన ఈ ధారావాహిక యొక్క వినోదాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేము చాలా సంతోషిస్తున్నాము."

‘స్థానిక ప్రతిభకు ప్రపంచ వేదికను అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్న కామిక్‌స్టాన్ సెమ్మా కామెడీ పా వంటి ప్రాజెక్టులో భాగం కావడం మాకు సంతోషంగా ఉంది. అనేక స్టాండ్-అప్ కామెడీ స్పెషల్స్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియోతో మా బలమైన సహకారాన్ని పెంచడం, కామెడీస్టాన్ కామెడీలో తాజా, కొత్త గాత్రాలను కనుగొని, వారిని అలంకరించడానికి మా సమిష్టి ప్రయత్నం చేస్తున్నాము. కామిక్‌స్టాన్ సెమ్మా కామెడీ పా తో, అదే వేగాన్ని కొనసాగించడం మరియు ప్రేక్షకులకు మరింత సృజనాత్మక, సాపేక్ష మరియు ఆసక్తికరమైన కామెడీ ఫార్మాట్‌లను తెరపైకి తీసుకురావడమే మా ప్రయత్నం. ” OML ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ్ శేత్ అన్నారు.
 
లింక్: _____________

కధాసారాంశం:
కొంతమంది ప్రఖ్యాత తమిళ స్టాండప్ కమెడియన్లచే సలహా ఇవ్వబడింది మరియు తీర్పు ఇవ్వబడింది, కామిక్‌స్టాన్ తమిళంలో, తమిళ స్టాండ్-అప్ కామెడీ సన్నివేశంలో "ఫ్యూచర్ ఆఫ్ ఫన్నీ" గా మారడానికి పోటీపడే హాస్యనటులను కలిగి ఉంది. ఓన్లీ మచ్ లౌడర్ (OML) నిర్మించిన, కామిక్‌స్టాన్ తమిళ వెర్షన్ కి అర్జున్ కార్తికేయన్ దర్శకత్వం వహించారు మరియు డి.జై ఆదిత్య మరియు మెర్విన్ రోజారియో ఎ రచించారు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా సెప్టెంబర్ 11, 2020 నుండి కామిక్స్టాన్ తమిళ్ యొక్క అన్ని ఎపిసోడ్లను వీక్ల్షించండి
 
స్మార్ట్ టీవీలు, మొబైల్ పరికరాలు, ఫైర్ టివి, ఫైర్ టివి స్టిక్, ఫైర్ టాబ్లెట్లు, ఆపిల్ టివి, ఎయిర్‌టెల్, వొడాఫోన్ మొదలైన వాటి కోసం అందుబాటులో ఉన్న ప్రైమ్ వీడియో యాప్‌లో ప్రైమ్ సభ్యులు కామిక్స్టాన్ తమిళ్ యొక్క అన్ని ఎపిసోడ్లను ఎక్కడైనా మరియు ఎప్పుడైనా చూడగలరు. ప్రైమ్ వీడియో అనువర్తనంలో, ప్రైమ్ సభ్యులు వారి మొబైల్ పరికరాలు మరియు టాబ్లెట్‌లలో ఎపిసోడ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు అదనపు ఖర్చు లేకుండా ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా చూడవచ్చు. ప్రైమ్ వీడియో భారతదేశంలో సంవత్సరానికి ₹999 లేదా నెలకు ₹129 తో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా లభిస్తుంది, కొత్త కస్టమర్లు www.amazon.in/prime పై క్లిక్ చెయ్యడం ద్వారా మరింత తెలుసుకోవచ్చు మరియు 30 రోజుల ఉచిత ట్రయల్‌కు సుబ్స్క్రిప్షన్ పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com