నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన తెలంగాణ హోం మంత్రి
- September 04, 2020
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర హోంశాఖమంత్రి మహ్మద్ మహమూద్ అలీ సీనియర్ స్థాయి పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.హైదరాబాద్ లోని తన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రవి గుప్తా హోం శాఖ ముఖ్య కార్యదర్శి, జితేందర్ అడిషనల్ డిజిపి (శాంతి భద్రతలు), అంజనీ కుమార్ హైదరాబాద్ పోలీసు కమిషనర్, శిఖా గోయెల్, అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు), వి.సి. సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమీషనర్, అనిల్ కుమార్, అదనపు కమిషనర్ (ట్రాఫిక్) , సుధీర్ బాబు, రాచకొండ అడిషనల్ కమీషనర్ లు పాల్గొన్నారు.మొహర్రం మరియు గణేష్ నవరాత్రి మరియు నిమజ్జనం శాంతియుతంగా, విజయవంతంగా పూర్తి కావడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినందుకు పోలీసు అధికారులను మంత్రి ప్రశంసించారు.సమావేశంలో హోం మంత్రి మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈసారి పండుగలకు ప్రత్యేకత ఉందని హోంమంత్రి అన్నారు.శాంతిభద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ మరియు ప్రజల స్నేహపూర్వక కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు దేశంలో నంబర్ 1 స్థానంలో ఉన్నారని, నేరాలను గుర్తించడం, ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ నేరాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడాన్ని మంత్రి సమావేశంలో పునరుద్ఘాటించారు.నగరంలో ట్రాఫిక్ యొక్క స్థితిని మరియు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ట్రాఫిక్ సజావుగా సాగడానికి ఏర్పాట్లను సమీక్షించారు. పోలీస్ శాఖలో కరోనా వైరస్ కారణంగా తీసుకుంటున్న చర్యలను మరియు పోలీసు సిబ్బంది మరియు అధికారులు కరోనా వైరస్ బారిన పడకుండా కాపాడటం గురించి మంత్రి సమీక్షించారు.కరోనాని ఎదుర్కునేందుకు యోధులుగా విధులను నిర్వహిస్తున్న పోలీసు అధికారులను, సిబ్బందిని మంత్రి అభినందించారు.ఈ నేపధ్యంలో ప్లాస్మా విరాళం ప్రచారం ప్రారంభించినందుకు , సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో ప్లాస్మా బ్యాంక్‌ను స్థాపించడంలో చురుకైన, సమర్థవంతమైన చర్యలు తీసుకున్న సైబరాబాద్ పోలీసు కమీషనర్ వి.సి. సజ్జనార్‌ను హోం మంత్రి ప్రశంసించారు.

తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







