బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 9 మంది మహిళలు మృతి
- September 04, 2020
కడలూరు:తమిళనాడులోని ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 9 మంది మృత్యువాతపడ్డారు. మృతులంతా మహిళలే అని అధికారులు అంటున్నారు. ఘటనాస్థలంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందినట్టు.. అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధాని చెన్నైకి 190 కిలోమీటర్ల దూరంలో... కడలూరు జిల్లాలోని కట్టుమన్నార్ కోయిల్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







