కోవిడ్19:పాక్షిక కర్ఫ్యూ మళ్లీ విధిస్తున్నారన్న ప్రచారాన్ని కొట్టిపారేసిన కువైట్
- September 04, 2020
కువైట్ సిటీ:కువైట్ లో మళ్లీ పాక్షికంగా కర్ఫ్యూని విధిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. గురువారం ఒక్క రోజే కువైట్ లో 900 కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే..కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ పాక్షికంగా కర్ఫ్యూ విధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వదంతలు మొదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కర్ఫ్యూ విధింపు స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఎలాంటి కర్ఫ్యూ విధించే యోచన లేదని తెలిపింది. కరోనా కేసులు గతంలో కన్నా ఎక్కువగా నమోదవుతున్నా..షాపులు, మార్కెట్లు సివేయబోమని తేల్చి చెప్పింది. అయితే..కరోనా తీవ్రత పెరగటానికి ప్రజలు సరైన జాగ్రత్తలు పాటించకపోవటమేనని ఆరోగ్యశాఖ వెల్లడించింది. భౌతిక దూరం పాటించకుండా ఇళ్లలో, ఆఫీసులలో గుమిగూడటమే వైరస్ వ్యాప్తికి కారణం అవుతోందని..అలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







