నూతన విద్యా విధానం 2020 పై గవర్నర్ల సదస్సులో పాల్గొననున్న ఏ.పి గవర్నర్
- September 04, 2020
విజయవాడ:ఉన్నత విద్యావిధానంలో మార్పులు ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానం 2020పై నిర్వహిస్తున్న గవర్నర్ల సదస్సులో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఆహ్వానం పలికారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెప్టెంబర్ 7న ఈ కార్యక్రమం జరగనుండగా, అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం గవర్నర్ హరిచందన్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ అంశంపై చర్చించారు. ఏడవ తేదీ నాటి సదస్సులో అభిప్రాయాలు పంచుకోవాలని కోరారు. గవర్నర్ల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పాల్గొననుండగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఈ సమావేశంలో అన్ని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యా శాఖ మంత్రులు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, విద్యాశాఖ కార్యదర్శులు, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల కార్యదర్శులు పాల్గొననున్నారు. వర్చువల్ విధానంలో ఎక్కడి వారు అక్కడే ఉండి ఈ సదస్సులో తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకోనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేకించి నూతన విద్యావిధానంపై అమలుపై లోతైన చర్చకు నిర్ధేశించారు
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







