తెలంగాణ ప్రభుత్వంతో పలు అంశాల్లో కలిసి పనిచేసేందుకు వాల్‌మార్ట్‌ సిద్ధం

- February 09, 2016 , by Maagulf
తెలంగాణ ప్రభుత్వంతో పలు అంశాల్లో కలిసి పనిచేసేందుకు వాల్‌మార్ట్‌ సిద్ధం

తెలంగాణ ప్రభుత్వంతో పలు అంశాల్లో కలిసి పనిచేసేందుకు ప్రముఖ రిటైల్‌ సంస్థ వాల్‌మార్ట్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు త్వరలోనే మూడు అవగాహన ఒప్పందాలు కుదర్చుకోనుంది. ఈరోజు సచివాలయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో వాల్‌మార్ట్‌ ఉపాధ్యక్షుడు ఎన్రిక్‌ ఓస్తలే సమావేశమయ్యారు. భారతదేశంలో వాల్‌మార్ట్‌ విస్తరణ ప్రణాళికలపై కేటీఆర్‌తో ఆయన చర్చించారు. హైదరాబాద్‌లో నగరంలో మరిన్ని దుకాణాలను తెరవనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే స్థలాలను ఎంపిక చేశామని... త్వరలోనే వైద్య, నైపుణ్య శిక్షణ రంగాల్లో కూడా సేవలు విస్తరిస్తామని చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com