ఒమాన్ దేశంలో ఇబ్బందుల్లో ఉన్న భారతీయులకు మొబైల్ యాప్
- February 09, 2016
ఒమాన్ దేశంలో ఇబ్బందుల్లో ఉన్న భారతీయ కార్మికుల కోసం అక్కడి భారత ఎంబసీ ఓ మొబైల్ యాప్ విడుదల చేసింది. 'మిగ్‌కాల్' పేరుతో విడుదల చేసిన ఈ యాప్‌ను ఇప్పటికే పదివేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్ లేని సమయాల్లో కూడా ఈ యాప్ ద్వారా సహాయం పొందడానికి సులువుగా ఉంటుందని ఎంబసీ అధికారులు వెల్లడించారు. ఒమాన్ లో భారత అంబాసిడర్ ఇంద్రామణి పాండే గత నెలలో మిగ్‌కాల్ యాప్‌ను లాంచ్ చేశారు. పదివేల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ యాప్ వివిధ భారతీయ భాషలు హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







