విమానాశ్రయాలను తిరిగి ప్రారంభించటానికి సిద్ధమవుతున్న ఒమన్

- September 08, 2020 , by Maagulf
విమానాశ్రయాలను తిరిగి ప్రారంభించటానికి సిద్ధమవుతున్న ఒమన్

మస్కట్:విమానయానికి సంబంధించి ఒమన్ సుప్రీం కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఒమన్ లోని విమానాశ్రయాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించింది. అనంతరం విమానాశ్రయాలను ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే..ఇతర దేశాల్లో కోవిడ్ తీవ్రతను బట్టి ఆయా దేశాలకు సర్వీసులను కొనసాగించాలా..లేదా..అనేది ఎప్పటిప్పుడు సమీక్షించుకుంటామని తెలిపింది. అదే సమయంలో వివిధ దేశాలతో పరస్పరం ఉన్న ఒప్పందం మేరకు అనుమతి ఉన్న దేశాలకు మాత్రమే సర్వీసులను నడపనుంది. ఇదిలాఉంటే 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ ఇచ్చిన నివేదికపై కూడా కమిటీ సమీక్షించింది. కరోనా నేపథ్యంలో విద్యార్ధుల భద్రతకు ప్రధాన్యం ఇస్తూనే..నాణ్యమైన విద్య అందించే అవకాశాలు, విధానాలపై చర్చించింది. విద్యార్ధుల ఆసక్తి, కరోనా తీవ్రతను పరిగణలోకి తీసుకొని అందుకు అనుగుణంగా పరిస్థితిని అంచనా వేసి విద్యా విధానంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కమిటీ వివరించింది. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com