సీనియర్ నటుడు జయప్రకాష్‌రెడ్డి కన్నుమూత
- September 08, 2020
సీనియర్ నటుడు జయప్రకాష్‌రెడ్డి హఠాన్మరణం చెందారు. కోవిడ్ ఎఫెక్ట్‌తో ప్రస్తుతం షూటింగ్‌లు లేని కారణంగా ఆయన గుంటురులోని విద్యానగర్‌లో ఉన్నారు. అక్కడే ఆయన హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. తెల్లవారుజామున బాత్‌రూమ్‌లోనే ఆయన కుప్పకూలిపోయారు. ఈ వార్త తెలుగు ప్రేక్షకులందరినీ షాక్‌కు గురి చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయప్రకాష్‌రెడ్డి విలనిజానికి కొత్త అర్థం చెప్పారు. ప్రేమించుకుందాం రా.. సినిమాతో మొదలుపెట్టి అనేక సినిమాల్లో రాయలసీమ యాసతో ఆయన పాపులర్ అయ్యారు. ఇక కామిడీ విషయంలోనూ ఆయన టైమింగుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కిక్, ఢీ, రెడీ, కృష్ణ, రచ్చ, రేసుగుర్రం, నాయక్, బాద్‌షా, టెంపర్, పటాస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నో చిత్రాల్లో నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రాయలసీమ యాసే కాదు తెలంగాణ మాండలికాల్ని కూడా అద్భుతంగా పలికించిన ఘనత ఆయన సొంతం.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?