దుబాయ్:ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఫేక్ ఏజెన్సీ నిర్వాహకుడి అరెస్ట్
- September 08, 2020
దుబాయ్:ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ఫేక్ ఏజెన్సీ ముఠా గుట్టురట్టైంది. దుబాయ్ పోలీసులు ఫేక్ ఏజెన్సీ నిర్వాహకుడ్ని అరెస్ట్ చేసి..నకిలీ స్లిప్పులు, డబ్బులు తీసుకున్న నకిలీ రశీదులను స్వాధీనం చేసుకున్నారు. అసియాకు చెందిన వ్యక్తి ఈ నకిలీ ఏజెన్సీని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దుబాయ్ లోని ఓ ప్రాంతంలో అతను ఓ నకిలీ ఏజెన్సీ ఏర్పాటు చేసి...తమ దగ్గర ఉద్యోగావకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేవాడు. ఆకర్షణీయమైన జీతం..అంటూ నిరుద్యోగులకు ఎర వేసేవాడు. ప్రకటనలు చూసి ఏజెన్సీని కాంటాక్ట్ అయిన వ్యక్తులను రిక్రూట్మెంట్ ఫీజులు, ఇతర ట్యాక్సుల పేరుతో కొంత డబ్బు తమకు పంపించాలని ఏజెన్సీ కోరేది. దీనికితోడు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కోసం అంటూ మరికొంత సొమ్ము దండుకునేవారు. ఇలా దాదాపు 150 మందిని ఈ మోసం చేశాడు నిందితుడు. ఒక్కో వ్యక్తి దగ్గర 1000 నుంచి 3000 దిర్హామ్స్ వరకు వసూలు చేశాడు. అయితే..ఓ వ్యక్తి తనకు వర్క్ వీసా, స్టేటస్ చేంజ్ కోసం 3000 దిర్హామ్స్ చెల్లించి మోసపోయాడు. విషయం తెల్సకున్న దుబాయ్ సీఐడీ ఫేక్ ఏజెన్సీపై రైడ్ చేసి నిందితుడ్ని అరెస్ట్ చేసింది. ప్రస్తుత కోవిడ్ సంక్షోభ పరిస్థితుల్లో చాలా మంది ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్నారని, అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని నిందితుడు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వివరించారు. నిజమైన ఏజెన్సీలు ఎప్పుడు ఉద్యోగావకాశాల కోసం డబ్బులు వసూలు చేయవని...ఈ విషయాన్ని నిరుద్యోగులు దృష్టిలో ఉంచుకొని మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా ప్రచారమయ్యే మోసపూరిత ప్రకటనలపై తాము ఎప్పటికప్పుడు నిఘా వేసి ఉంచుతామని సీఐడీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్‌లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం









