బహ్రెయిన్ లో కొత్తగా 644 కరోనా కేసులు..సుల్తానేట్లో మరో నలుగురు మృతి
- September 08, 2020
మనామా:బహ్రెయిన్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే సుల్తానేట్ పరిధిలో కొత్తగా 644 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య 55,415కి పెరిగింది. మరోవైపు వైరస్ బారిన పడి మరో నలుగురు మృతి చెందారు. మరణించిన నలుగురు మహిళలే. దీంతో ఇప్పటివరకు సుల్తానేట్ లో కరోనా మరణాల సంఖ్య 200కి చేరింది. ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా నమోదైన 644 కరోనా కేసులలో 87 మంది ప్రవాసీయులు ఉన్నారు. ఇదిలాఉంటే..కరోనా నుంచి నిన్న 301 మంది కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 50,946 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సుల్తానేట్ పరిధిలో 4,270 యాక్టీవ్ కేసులు ఉండగా..అందులో 90 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 32 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 10,459 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించామని, ఇప్పటివరకు సుల్తానేట్ వ్యాప్తంగా 11,72,808 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







