హీరోగా రానున్న ప్రభాస్ తమ్ముడు

- February 10, 2016 , by Maagulf
హీరోగా రానున్న ప్రభాస్ తమ్ముడు

యంగ్ రెబల్ స్టార్ ఇంటి నుంచి మరో హీరో రాబోతున్నాడు. ప్రభాస్ కజిన్.. రవి వర్మ తెరంగేట్రం చేయనున్నాడు. ఇతడిలో ప్రభాస్ పోలికలు ఎక్కువగా ఉన్నాయి. కటౌట్ ఇచ్చుమిచ్చు ప్రభాస్ ని పోలివుంటుంది. ప్రభాస్ ఫ్యామిలీ నుంచి కదా అని ఓ హడావుడి చేయకుండా కూల్ లా ఎంట్రీ ఇచ్చేయనున్నాడు రవి వర్మ. చౌడప్ప అనే కొత్త దర్శకునితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రభాస్ ఇంటి నుంచి ఇటీవలే ఓ హీరో వచ్చిన విషయం తెలిసిందే. అతను కూడా ప్రభాస్ కు కజినే. పేరు సిద్ధార్థ్. 'కెరటం' తెలుగు చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కు జంటగా జతకట్టాడు. కానీ.. కెరటం విజయకెరటం ఎగరవేయకపోవడంతో మళ్లీ కనిపించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com