'మాల్ ఆఫ్ ది వరల్డ్' ప్రాజెక్ట్ శరవేగంగా
- February 10, 2016
ప్రపంచంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ 'మాల్ ఆఫ్ ది వరల్డ్' ప్రాజెక్ట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని దుబాయ్ స్పష్టం చేసింది. 8 మిలియన్ చదరపు అడుగులు (745,000 చదరపు మీటర్లు) షాపింగ్ స్పేస్, థీమ్ పార్క్, 100 హోటళ్ళు, 20,000 రూములతో సర్వీస్డ్ అపార్ట్‌మెంట్ బిల్డింగ్స్ ఇందులో ప్రత్యేకతలు. 2014లో ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న చమురు ధరల సంక్షోభం, దాని కారణంగా గల్ఫ్ దేశాల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో 'మాల్ ఆఫ్ ది వరల్డ్'పై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నా, 'మాల్ ఆఫ్ ది వరల్డ్'ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని అధికారులు చెప్పారు. 2020 ఎక్స్‌పో ఎగ్జిబిషన్ సమయానికి ఈ మాల్ ఆఫ్ ది వరల్డ్ పూర్తవుతుంది. ప్రాజెక్ట్‌ని పూర్తి చేయడానికి అన్ని వర్గాల సలహాలు, సూచనలు, సహకారాలు తీసుకుంటామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







