బురైమి కోసం ఎక్స్పాట్ టూరిస్ట్ వీసా ప్లాన్
- February 10, 2016
బురైమి నుంచి ఒమన్లోని వివిధ ప్రాంతాలకు వచ్చి వెళ్ళేవారి కోసం 'ఎక్స్పాట్ టూరిస్ట్ వీసా'లో కొత్త మార్పులు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఒమన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, బురామీ బ్రాంచ్ ఈ దిశగా పలు ఆలోచనల్ని చేస్తోంది. ఒమన్ బోర్డర్లో ఉన్న బురామీ నుంచి నిత్యం ఒమన్లోని పలు ప్రాంతాలకు వలసదారులు పలు రకాలైన పనుల నిమిత్తం వస్తుంటారు. అయితే ప్రతిరోజూ ఒమన్ నుంచి టూరిస్ట్ వీసా తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి వచ్చి, వెళ్ళడాని కోసం ఉపయోగపడే ఈ వీసా కోసం 5 ఒమన్ రియాల్స్ని ఫీజుగా చెల్లించవలసి ఉంటుంది. దీన్ని వారం రోజులకు వీలుగా పొడిగిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ పర్మిషన్ తీసుకోకుండా ఒమన్ నుంచి బురామీకి వచ్చి, వెళితే వీసా పూర్తిగా రద్దయిపోతుందనే నిబంధన ఇప్పటిదాకా ఉంది. దాన్ని కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







