బురైమి కోసం ఎక్స్‌పాట్‌ టూరిస్ట్‌ వీసా ప్లాన్‌

- February 10, 2016 , by Maagulf
బురైమి కోసం ఎక్స్‌పాట్‌ టూరిస్ట్‌ వీసా ప్లాన్‌

బురైమి నుంచి ఒమన్‌లోని వివిధ ప్రాంతాలకు వచ్చి వెళ్ళేవారి కోసం 'ఎక్స్‌పాట్‌ టూరిస్ట్‌ వీసా'లో కొత్త మార్పులు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఒమన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, బురామీ బ్రాంచ్‌ ఈ దిశగా పలు ఆలోచనల్ని చేస్తోంది. ఒమన్‌ బోర్డర్‌లో ఉన్న బురామీ నుంచి నిత్యం ఒమన్‌లోని పలు ప్రాంతాలకు వలసదారులు పలు రకాలైన పనుల నిమిత్తం వస్తుంటారు. అయితే ప్రతిరోజూ ఒమన్‌ నుంచి టూరిస్ట్‌ వీసా తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి వచ్చి, వెళ్ళడాని కోసం ఉపయోగపడే ఈ వీసా కోసం 5 ఒమన్‌ రియాల్స్‌ని ఫీజుగా చెల్లించవలసి ఉంటుంది. దీన్ని వారం రోజులకు వీలుగా పొడిగిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ పర్మిషన్‌ తీసుకోకుండా ఒమన్‌ నుంచి బురామీకి వచ్చి, వెళితే వీసా పూర్తిగా రద్దయిపోతుందనే నిబంధన ఇప్పటిదాకా ఉంది. దాన్ని కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com