దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ కాంకోర్స్‌ డి ట్రయల్‌

- February 10, 2016 , by Maagulf
దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ కాంకోర్స్‌ డి ట్రయల్‌

యుఏఈకి చెందిన 2,000 మంది రెసిడెంట్స్‌ దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ కాంకోర్స్‌ డి ట్రయల్‌లో పాల్గొన్నారు. నెలల తరబడి జరిగిన అనేక పరిశీలనలు, ప్రయోగాల అనంతరం ఈ మేజర్‌ ట్రయల్‌ని నిర్వహించారు. 70కి పైగా ఇంటర్నేషనల్‌ కెరీర్స్‌కి సేవలందించేలా ఈ కాంకోర్స్‌ డిని రూపొందించారు. కాంకోర్స్‌ డి ద్వారా దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కెపాసిటీని ఏడాదికి 75 మిలియన్ల నుంచి 90 మిలియన్ల ప్రయాణీకులకు పెంచేందుకు ఉపకరిస్తుంది. ట్రాఫిక్‌ పరంగా ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా సౌకర్యాల పరంగా, సేవల పరంగా దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ మరింత పేరు ప్రఖ్యాతులు సాధిస్తుందని దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ సిఇఓ పాల్‌ గ్రిఫిత్స్‌ చెప్పారు. మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు, ప్రత్యేక సహాయం అవసరమయ్యేవారూ ఇలా విభిన్న రకాలైనవారితో ట్రయల్‌ రన్‌ అద్భుతంగా సాగింది. ట్రయల్‌ రన్‌లో పాల్గొన్నవారంతా సౌకర్యాలను చూసి ఆశ్చర్యపోయారు. కాంకోర్స్‌ డి అందాల్ని చూసి మైమర్చిపోయారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com