దుబాయ్ ఇంటర్నేషనల్ కాంకోర్స్ డి ట్రయల్
- February 10, 2016
యుఏఈకి చెందిన 2,000 మంది రెసిడెంట్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ కాంకోర్స్ డి ట్రయల్‌లో పాల్గొన్నారు. నెలల తరబడి జరిగిన అనేక పరిశీలనలు, ప్రయోగాల అనంతరం ఈ మేజర్ ట్రయల్‌ని నిర్వహించారు. 70కి పైగా ఇంటర్నేషనల్ కెరీర్స్‌కి సేవలందించేలా ఈ కాంకోర్స్ డిని రూపొందించారు. కాంకోర్స్ డి ద్వారా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కెపాసిటీని ఏడాదికి 75 మిలియన్ల నుంచి 90 మిలియన్ల ప్రయాణీకులకు పెంచేందుకు ఉపకరిస్తుంది. ట్రాఫిక్ పరంగా ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా సౌకర్యాల పరంగా, సేవల పరంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరింత పేరు ప్రఖ్యాతులు సాధిస్తుందని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సిఇఓ పాల్ గ్రిఫిత్స్ చెప్పారు. మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు, ప్రత్యేక సహాయం అవసరమయ్యేవారూ ఇలా విభిన్న రకాలైనవారితో ట్రయల్ రన్ అద్భుతంగా సాగింది. ట్రయల్ రన్లో పాల్గొన్నవారంతా సౌకర్యాలను చూసి ఆశ్చర్యపోయారు. కాంకోర్స్ డి అందాల్ని చూసి మైమర్చిపోయారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







