ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం : 60 మందికి గాయలు
- February 10, 2016
ఈజిప్టులో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 60 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. రైలు అస్వాన్ నుంచి రాజధాని కైరో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బెని సూఫ్ నగరంలో వెళ్తున్న రైలు టర్న్ అవుతుండగా రెండు బోగీలు పట్టుతప్పి రైలు నుంచి విడిపోయి పట్టాల పక్కన పడిపోయాయని సమాచారం.ఈ ప్రమాదంలో రెండు బోగీల్లో ప్రయాణిస్తున్న వారు గాయపడ్డారని భద్రతాధికారులు, మెడికల్ ఉన్నతాధికారులు వివరించారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి 40కి పైగా అంబులెన్స్ లు పంపించి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







