వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా : కేసీఆర్
- February 10, 2016
వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి ఆథారిటీ కమిటీని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డు ఐఏఎస్ అధికారి ఎం.పురుషోత్తమరెడ్డిని వైస్ చైర్మన్ అండ్ సీఈఓగా నియమించారు. కరీంనగర్ ఎంపీ, వేములవాడ, సిరిసిల్ల ఎమ్మెల్యేలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యకార్యదర్శి, ఫైనాన్స్ శాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయ ముఖ్య కార్యదర్శి, టౌన్ ప్లానింగ్ డెరైక్టర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్, కరీంనగర్ ఎస్పీ, కరీంనగర్ వెస్ట్ డీఎఫ్ఓతో పాటు మరో ఆరుగురు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులుగా ఉంటారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. అథారిటీ నిర్వహణ కోసం తాత్కాలికంగా 14 మంది సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







