'చావుకబురుచల్లగా' మూవీ నుంచి స్పెషల్ వీడియో విడుదల
- September 19, 2020
హైదరాబాద్:మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ ఫుల్ స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా, హ్యాపెనింగ్ యంగ్ హీరో కార్తీకేయ, లక్కీ బ్యూటీ లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం "చావుకబురుచల్లగా". టైటిల్ తోనే అటు చిత్ర పరిశ్రమ వర్గాల్లో, ఇటు సాధరణ ప్రేక్షకుల్లో ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభించడం విశేషం. దాంతో పాటే విడుదల చేసిన హీరో కార్తికేయ పోషించిన "బస్తి బాలరాజు" ఫస్ట్ లుక్ సైతం సోషల్ మీడియాలో ఫుల్ ఫుల్ క్రేజ్ అందుకుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 21న హీరో కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా, ఉదయం 11: 47 ని.లకు వరల్డ్ ఆఫ్ బస్తీ బాలరాజు పేరుతో ఓ స్పెషల్ వీడియోని విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే ముగిసింది. ఇక త్వరలోనే నూతన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించి, శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసే దిశగా ప్లాన్ చేస్తున్నట్లుగా నిర్మాత బన్నీ వాసు తెలిపారు.
తారాగణం
కార్తీకేయ, లావణ్య త్రిపాఠి, ఆమని తదితరులు
సాంకేతిక వర్గం
సమర్పణ - అల్లు అరవింద్
బ్యానర్ - జీఏ2 పిక్చర్స్
నిర్మాత - బన్నీ వాసు
సినిమాటోగ్రాఫర్ - సునీల్ రెడ్డి
మ్యూజిక్ - జకీస్ బిజాయ్
దర్శకుడు - కౌశిక్ పెగళ్లపాటి
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







