90వ జాతీయ దినోత్సవ వేడుక సౌదీ గత వైభవాన్ని స్పురణకు తెస్తోంది-ప్రిన్స్ ఖలీద్

- September 23, 2020 , by Maagulf
90వ జాతీయ దినోత్సవ వేడుక సౌదీ గత వైభవాన్ని స్పురణకు తెస్తోంది-ప్రిన్స్ ఖలీద్

రియాద్:90వ జాతీయ దినోత్సవ వేడుకలను సౌదీ అరేబియా అట్టహాసంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రాజు సల్మాన్ కు, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కు రక్షణ శాఖ ఉప మంత్రి ప్రిన్స్ ఖలీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాతీయ దినోత్సవం పురస్కరించుకొని సౌదీ వైభావాన్ని స్పురణకు తెస్తోందని, అదే సమయంలో దేశ ఉజ్వల భవిష్యత్తు లక్ష్యాలను మరింత పెంపొందిస్తోందని అన్నారు. అంతేకాదు జాతీయ దినోత్సవ వేళ సౌదీకి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన కింగ్ అబ్ధులాజీజ్ కృషిని, మాతృభూమి కోసం ఆయన త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కింగ్ అబ్ధులాజీజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన అన్నారు. ​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com