వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ప్రారంభం!
- September 24, 2020
హైదరాబాద్:వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీకాంత్, రీతూ రెడ్డి హీరో హీరోయిన్లుగా వరుణ్.కె దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. 1998 బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రేమకథగా తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల చివారివారంలో స్టార్ట్ కాబోతోంది.
పల్లెటూర్లలో ఉండే పగ ప్రతీకరాలతో ఈ చిత్ర కథాంశం ఉండబోతోంది. ఈ చిత్ర దర్శకుడు వరుణ్.కె గతంలో జ్యోతి లక్ష్మి, సఖియా, చిన్నదాన, మరోచిత్రం, మరువలేను వంటి అద్భుతమైన షాట్ ఫిలింస్ తీశారు. యూట్యూబ్ లో ఈ షార్ట్ ఫిలింస్ ప్రేక్షకాదరణ పొందాయి. ఆ అనుభవంతో వరుణ్.కె మొదటిసారి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో రోహిత్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అంతా కొత్తవారితో రూపొందుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండబోతొంది. త్వరలో ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.
హీరో: శ్రీకాంత్
హీరోయిన్: రీతూ రెడ్డి
సాంకేతిక నిపుణులు:
సంగీతం: రోహిత్
లిరిక్స్: తిరుపతి జావన్న
కెమెరామెన్: సురేష్ & బాబు
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: వరుణ్.కె
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







