తెలంగాణలో భారీ వర్షాలు..
- September 26, 2020
హైదరాబాద్:తెలంగాణ వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రం తడిసి ముద్దైంది. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. వర్షాల నేపథ్యంలో కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ లకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాల్లోనే ఉంటూ పరిస్థితులు తెలుసుకొని, ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల దృష్ట్యా అధికారులకు సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను సూచించారు. ఇక రానున్న 24 గంటలు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







