ఇండియాలో మరిన్ని స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లు దుబాయ్‌కి
- February 11, 2016
దుబాయ్ హోల్డింగ్ ఇండియాలో మరిన్ని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్ని దక్కించుకోనుంది. కోచితోపాటు ఇంకొన్ని నగరాలకు సంబంధించి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయనీ, భారత ప్రభుత్వం నుంచి తగిన నిర్ణయం వచ్చేదాకా వాటి వివరాలు వెల్లడించలేకపోతున్నామని దుబాయ్ హోల్డింగ్స్ ఛైర్మన్ అహ్మద్ బిన్ బ్యాట్ చెప్పారు. టెకామ్ ద్వారా దుబాయ్ హోల్డింగ్ కోచి, తిరువనంతపురం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగస్వామి అయ్యింది. ఫిబ్రవరి 20న ఫస్ట్ ఫేస్ ప్రారంభం జరుగుతుంది. కోచి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో తొలి స్థానం దక్కించుకోగా, మొత్తం 96 స్మార్ట్ సిటీలను చేపట్టాలనే లక్ష్యంతో ఉంది భారత ప్రభుత్వం. వీటిల్లో తొలి జాబితా కింద 20 నగరాలను ఇప్పటికే ప్రకటించడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







