ట్యాక్సీ మీటర్లను వ్యతిరేకిస్తున్న 'ఆరెంజ్' డ్రైవర్స్
- February 11, 2016
ఒమన్‌లో ట్యాక్సీలకు మీటర్ల వినియోగంపై దుమారం చెలరేగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆరెంజ్ ట్యాక్సీ డ్రైవర్స్ వ్యతిరేకించారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్‌తో జరిగిన సమావేశంలో ట్యాక్సీ ప్రతినిథులు ప్రభుత్వ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ట్యాక్సీలకు మీటర్లను బిగించడం ద్వారా వినియోగదారులకు ఛార్జీల మోత మోగిపోతుందనీ, అది తమ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని 500 ఆరెంజ్ ట్యాక్సీ డ్రైవర్స్ తరఫున అధికార ప్రతినిథిగా వచ్చిన సులేమాన్ అల్ జర్దానీ చెప్పారు. అయితే ట్యాక్సీల్లో ప్రయాణించేవారు, ట్యాక్సీ డ్రైవర్లు అదనంగా సొమ్ములు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు చేయడంతో ఈ మీటర్ ప్రతిపాదన చేయాల్సి వచ్చిందని రాయల్ ఒమన్ పోలీసులు అలాగే మంత్రివర్గ అధికారులు వెల్లడించారు. అయితే ఛార్జీల పెంపుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చినా, వాటిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదనీ, వద్దంటున్న మీటర్ విధానాన్ని తమకు ఇష్టం లేకపోయినా ఎలా అమలు చేయాలని అనుకుంటున్నారని ట్యాక్సీ డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







