KXIP పై RR విజయం
- September 27, 2020
షార్జా: షార్జా క్రికెట్ స్టేడియం లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. కింగ్స్ విసిరిన 224 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్తాన్ సాధించి మరో విక్టరీని ఖాతాలో వేసుకుంది. స్టీవ్ స్మిత్(50; 27 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజూ శాంసన్(85; 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), తెవాతియా( 53; 31 బంతుల్లో 7 సిక్స్‌లు)లు రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఓపెనర్ జోస్ బట్లర్(4) విఫలమైనా, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్‌ల జోడి 81 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. 9 ఓవర్ల ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ 100 పరుగుల మార్కును దాటడంతో రాజస్తాన్ సునాయాసంగా విజయం సాధిస్తుందని అనుకున్నారు. కానీ మ్యాచ్ చివరి వరకూ నువ్వా-నేనా అన్నట్లు సాగింది. ఒకవైపు శాంసన్ పరుగుల మోత మోగిస్తుంటే, తెవాతియా తొలుత ఆపసోపాలు పడ్డాడు. కానీ ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టిన తెవాతియా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. శాంసన్ ఔటైన తర్వాత తెవాతియా బ్యాట్‌కు పని చెప్పడంతో రాజస్తాన్ చివరకు విజయాన్ని నమోదు చేసింది. ఆఖర్లో ఆర్చర్ 3 బంతుల్లో 2 సిక్స్‌లు కొట్టడంతో రాజస్తాన్ ఇంకా మూడు బంతులు ఉండగానే విజయం సాధించింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







