స్పైసీ అండ్ క్రిస్పీ ఎగ్ చిల్లీ
- February 11, 2016
కావలసిన పదార్ధాలు: ఉడికించిన కోడిగుడ్లు- 4, పచ్చిమిర్చి పేస్ట్- 1 టీస్పూన, పండుమిర్చి పేస్ట్- 1 టీస్పూన, ఉల్లిపాయ తరుగు- 2 టేబుల్ స్పూన్లు, అల్లం, వెల్లుల్లి తరుగు- కొంచెం, చింతపండు గుజ్జు- 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, సోయాసాస్- 1 టీస్పూన, నూనె- వేయించడానికి సరిపడా
తయారీ విధానం: ముందుగా పానలో నూనె పోసి వేడయ్యాక గుడ్లను మెల్లగా వేసి పైనంతా గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీసి పక్కన పెట్టాలి. తర్వాత విడిగా మరో పానలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తరుగు వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అందులో పండుమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి నిమిషంపాటు వేయించాలి. దానికి సోయాసాస్, చింతపండు గుజ్జు, ఉప్పువేసి ఉడికించి స్టౌ కట్టేయాలి. తరువాత ఆ మిశ్రమంలో వేయించిన గుడ్లకు సాస్ పూసి వేయాలి. చైనీస్ రైస్, రోటీ లేదా పరోటాలోకి ఈ చిల్లీ ఎగ్ కాంబినేషన రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







