సోనూ సూద్ కి ఐక్య రాజ్య సమితి అవార్డు..
- September 29, 2020
ముంబై:ప్రముఖ నటుడు సోనూసూద్‌కి అరుదైన అవార్డు వరించింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సోనూసూద్‌కి ఎస్డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డును ప్రకటించింది. లాక్డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులు, విద్యార్థులకు సేవలు అందించినందుకు గానూ ఆయనకు ఈ అవార్డు లభించింది. వర్చువల్ కార్యక్రమంలో ఈ అవార్డును సోమవారం సాయంత్రం ప్రదానం చేశారు. దీంతో ఐరాస అవార్డును అందుకున్న హాలీవుడ్ నటులు ఏంజెలినీ జోలీ, డేవిడ్ బెక్‌హామ్, లియోనార్డో డి కాప్రియో, బాలీవుడ్ నటి ప్రియాంక తదితరుల సరసన సోనూ చేరారు. దీనిపై సోనూ మాట్లాడుతూ.. ఇదొక గౌరవం. ఐరాస గుర్తింపు పొందడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నాకు వీలైన విధంగా ఏ ప్రయోజనం ఆశించకుండా నా దేశ ప్రజలకు చేయగలిగిన కొద్దిపాటి సాయాన్ని చేశా. నా సేవలను గుర్తించి, అవార్డును అందించడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







