స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బయటపెట్టనున్న 'మోసగాళ్లు' స్కామ్!
- September 30, 2020
హైదరాబాద్:విష్ణు మంచు హీరోగా నటిస్తోన్న 'మోసగాళ్లు' సినిమా ప్రమోషన్స్‌కు సపోర్ట్ ఇవ్వడానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుకు వచ్చారు.
ఇంతకుముందు టైటిల్ కీ థీమ్ మ్యూజిక్‌ను విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేయగా, దానికి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ పనితనానికి సర్వత్రా ప్రశంసలు లభించాయి.
ఇప్పుడు 'మోసగాళ్లు' చేసిన స్కామ్ ఏ స్థాయిదో బయటపెట్టేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. అక్టోబర్ 3న ఈ విషయాన్ని ఆయన వెల్లడించనున్నారు.
భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ క్రాస్-ఓవర్ ఫిల్మ్‌ను నిర్మాతలు విలక్షణంగా, విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు.
భారత్‌లో మొదలై, అమెరికాను వణికించిన చరిత్రలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా 'మోసగాళ్లు' చిత్రం రూపొందుతోంది.
విష్ణు మంచు లీడ్ రోల్ చేస్తూ నిర్మిస్తోన్న ఈ సినిమాని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ కనిపించనుండటం ఈ చిత్రంలోని విశేషం.
బాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు.
తారాగణం:
విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర, రుహీ సింగ్
సాంకేతిక బృందం:
సినిమాటోగ్రఫీ: షెల్డన్ చౌ
ప్రొడక్షన్ డిజైన్: కిరణ్‌కుమార్ ఎం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ ఆర్.
నిర్మాత: విష్ణు మంచు
దర్శకత్వం: జెఫ్రీ గీ చిన్
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







