దుబాయ్‌లో 'సెల్ఫీకార్'
- February 12, 2016
దుబాయ్‌ని 2020 నాటికి డిజేబిలిటీ ఫ్రెండ్లీ సిటీగా మార్చే క్రమంలో వినూత్న ఆలోచనలతో ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. డిజి రోబోటిక్స్ తాజాగా డ్రైవర్ రహిత కారుని 'ది సెల్ఫీకార్' పేరుతో రూపొందించింది. ఈ ప్రొటో టైప్ కారు డిజేబులిటీతో బాధపడ్తున్నవారికోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఎలక్ట్రిక్ కారుని, డ్రైవర్‌లెస్ కార్‌గా రూపొందించామనీ, వీల్‌ఛెయిర్‌కే పరిమితమయ్యేవారికి ఈ కారు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని డిజి రోబోటిక్స్ కంపెనీ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ గౌతమ్ ఆహుజా చెప్పారు. యాక్సెస్ ఎబిలిటీ వర్క్‌షాప్‌నూ డిజి రోబోటిక్స్ కంపెనీ పాల్గొంది. ఎక్స్‌పోలో 30 దేశాల నుండి సుమారు 150 మంది ఎగ్జిబిటర్స్ పాల్గొంటున్నారు. సెల్ఫీ కార్ విషయానికి వస్తే ఓ బటన్‌ని ప్రెస్ చేస్తే కారులోని సీటు ఎటు కావాలంటే అటు తిరుగుతుంది. టచ్ బటన్ లేదా వాయిస్ కమాండ్‌తో కారు నిర్దేశిత ప్రదేశానికి వెళ్ళేలా సాంకేతికతను అభివృద్ధి చేశారు. 2016 లోనే ఈ కారుని మార్కెట్‌లోకి తీసుకు వస్తామనీ 125,000 డాలర్ల నుంచి 130,000 డాలర్లదాకా ఈ కారు ఖరీదు ఉండవచ్చని ఆహుజా చెప్పారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







