కారు ప్రమాదం: అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ ఐదుగురు యువకులు

- October 05, 2020 , by Maagulf
కారు ప్రమాదం: అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ ఐదుగురు యువకులు

రియాద్: రియాద్‌కి 190 కిలోమీటర్ల దూరంలో షర్కా ప్రాంతంలో కారు వేగంగా దూసుకెళుతూ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు యువకులు అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. అల్‌ తలాతీన్‌ రౌండెబౌట్‌ వద్ద కారు ఓవర్‌టర్న్‌ అయినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్‌ పోలీస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఘటనలో 75 శాతం తప్పిదం అస్ఫాల్ట్‌ కారణంగా జరిగిందనీ, 25 శాతం డ్రైవర్‌ తప్పిదమని తెలుస్తోంది. కారు డ్రైవర్‌ తండ్రి మొహమ్మద్‌ అబు బతీన్‌ మాట్లాడుతూ, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడం దేవుడి దయ అని అన్నారు. అస్ఫాల్ట్‌ సమస్య వల్ల ఇది జరిగిందనీ, సంబంధిత అథారిటీస్‌ ఈ సమస్యపై దృష్టిపెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com