ఏడు ఒప్పందాలపై యు.ఎ.ఇ. - భారత్ సంతకాలు
- February 12, 2016
ఏడు ఒప్పందాలపై యు.ఎ.ఇ. - భారత్ సంతకాలు చేశాయి. ఇందులో సైబెర్ భద్రత , మౌలిక సదుపాయాల పెట్టుబడి బీమాలు తదితర అంశాలు ఉన్నాయి. అబుదాబీ,యు.ఎ.ఇ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ , యువరాజు గౌరవనీయ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహయన్ గురువారం ఢిల్లిలొభారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీల మధ్య చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇరువురు నేతలు జరిపిన చర్చలలో తీవ్ర భయం ఎదుర్కోవడంలో విసృతమైన చర్ఛ జరిగింది. కౌంటర్ టెర్రరిజం,సముద్ర భద్రతతో పాటు ద్వైపాక్షిక సహకారం , సైబర్ సహకారంతో ఇరు దేశాల భద్రతా సంస్థల మధ్య వీలైనంత ఎక్కువ సహకారం అందించుకోవాల్సి ఉంది. అలాగే, రెండు
దేశాలకు ముప్పును కల్గించే ఉగ్రవాద గ్రూపుల కార్యకలాపాలపై నిఘా పెట్టడంతో పాటు యువ్ అతను ఆన్ లైన్ల ద్వారా ఉగ్రవాదుల పట్ల ఆకర్షితులు కాకుండా అడ్డుకోవాల్సిన చర్యలు తీసుకోవడం తదితర ఒప్పందాలు జరిగాయి. ఏ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి అంటే...
* 1 రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంచే లక్ష్యంతో 2016 నుంచి 2018 వరకు పరస్పర సహకార ఒప్పందం పేరుతో ఎగ్జీక్యూటేవ్ ప్రోగ్రామే అభివృద్ధి మరియు జాతీయ వారసత్వ, పరస్పర ఆసక్తి ప్రచురణలను మార్పిడి చేసుకోవాల్సి ఉంది.
* 2 బీమా నిబంధనలలో సహకారం, ప్రోత్సాహించడమే లక్ష్యంగా యు.ఎ.ఇ. ఇన్సూరెన్స్ అథారిటీ మరియు భారతదేశం యొక్క ఇన్సూరెన్స్ రెగ్యులేటరి అండ్ అభివృద్ధి సంస్థ మధ్య ఒప్పందం జరిగింది.
* 3 ఆర్ధిక వాణిజ్య మరియు పెట్టుబడి సహకారం పొందే లక్ష్యంతో భారతదేశం యొక్క మౌలికరంగంలో పెట్టుబడుల కోసం యు.ఎ.ఇ.కు చెందిన పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయనున్నారు.
* 4 శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన వినియోగం మరియు అభివృద్ధి కోసంసాధారణ ఆసక్తి సాధించే లక్ష్యంతో యు.ఎ.ఇ. స్పేస్ ఏజెన్సీ మరియు భారత అంతరిక్ష పరిశొధన సంస్థ మధ్య ఒప్పందం జరిగింది.
* 5 పరస్పర ప్రయోజనాలు పొందేందుకు భారతదేశం మరియు యు.ఎ.ఇ. మధ్య నైపుణ్యమున్న ఇరు దేశాల కార్మికులను అవసరమైతే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం , బదలీ సమానత్వ సూత్రాలను అమలుచేసేందుకు యు.ఎ.ఇ. జాతీయ అర్హతల సంస్థ, భారతదెశ నైపుణ్య అభివృద్ధి ,వ్యాపార అభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ మధ్య ఒప్పందం జరిగింది.
* 6 రెండు దేశాలను అస్థిర పరిచేందుకు ఎలెక్ట్రానిక్ నేరాల ద్వారా బెదిరించే ధొరణలను నివారించేందుకు ఒక దేశం తో మరొక దేశం సహకరించుకోనేందుకు యు.ఎ.ఇ. అంతరంగిక మంత్రిత్వ శాఖ, భారత దెశ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖల మధ్య ఒప్పందం జరిగింది.
* 7 పునరుత్పాదక శక్తి విషయంలో పరస్పర సహకారం అమలు పరిచేందుకు పెట్టుబడులు , ఉమ్మడి పరిశోధనల కోసం యు.ఎ.ఇ. మరియు భారతదేశం మధ్య అన్ని అభివృద్ధి ప్రయత్నాలను ప్రారంభించుకొనేందుకు ఒకఒప్పందం జరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







