చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు
- February 12, 2016
తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి కసరత్తులు కూడా ప్రారంభించింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్మాతల మండలితో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమయ్యింది. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను నిర్మాతలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. చిత్ర నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానం తెలుగు చలన చిత్ర రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్‌కమిటీ తొలిసారిగా నిర్మాతల మండలితో సమావేశమయ్యింది. మంత్రులు తలసాని,కేటీఆర్, తుమ్మలతో మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, డి సురేష్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, కళ్యాణ్, కె ఎస్ రామారావు, ఆర్ నారాయణ మూర్తి, రామ్మోహన్ రావుతో పాటు ఇతర నిర్మాతలు, అధికారులు భేటీ అయ్యారు.చిత్ర నిర్మాణ అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని తీసుకురావాలని నిర్మాతల మండలి ప్రభుత్వాన్ని కోరింది. చిన్న సినిమాలు, బాలల చిత్రాలకు ఇప్పటి వరకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అమ్మాలి బ్లాక్ టిక్కెట్లను అరికట్టడానికి టికెట్ల ఆన్‌లైన్ అమ్మకాల విధానాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని నిర్మాతల మండలి సబ్ కమిటీని కోరింది. మల్టీప్లెక్స్ తరహాలో మిగతా థియేటర్లకు 5వ చిత్ర ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని సూచించింది. ఆర్‌అండ్‌బి, రెవెన్యూ, ఫైర్ సర్వీస్ నుంచి పొందాల్సిన అనుమతుల రెన్యూవల్స్ సమయం మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచాల్సిన అవసరం ఉందని పలువురు నిర్మాతలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సినిమా రంగంలో పనిచేస్తున్న వారికి చిత్రపురి దగ్గరే ఇళ్లు కట్టించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.సమస్యలను పరిష్కరిస్తామన్న తలసాని నిర్మాతల మండలి తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని తలసాని అన్నారు. చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని చెప్పారు. పుణె ఫిల్మ్ ఇనిస్ట్టిట్యూట్ తరహాలో తెలంగాణలోనూ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. నిర్మాతల మండలితో మరోసారి భేటీ కానున్న సబ్ కమిటీ నిర్మాతల మండలితో మరోసారి భేటీ అవ్వాలని సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా సినీ రంగంలో ఉన్న సంఘాలన్నీ ఏక తాటిపైకి రావాలని కమిటీ సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







