`పీనట్ డైమండ్` చిత్రం ప్రారంభం
- October 10, 2020హైదరాబాద్:ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై ప్రొడక్షన్ నెం.1గా వెంకటేష్ త్రిపర్ణ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం `పీనట్ డైమండ్`. అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. `బెంగాల్ టైగర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. జె. ప్రభాకర రెడ్డి ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఒక డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఈరోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా..
నిర్మాతలు అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ మాట్లాడుతూ - `` రెండు కాలమాణాలకి సంబందించిన ఒక విభిన్న కథాంశంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేవిధంగా ఈ మూవీ రూపొందుతోంది. 1989లో ఒక కథ జరుగుతూ ఉంటే దానికి ప్యారలల్‌గా 2020లో మరోక కథ రన్ అవుతూ ఉంటుంది. ఆ రెండు కథలకి సంభందం ఏంటి? అలాగే పీనట్ డైమండ్ అని విభిన్నమైన టైటిల్ ఎందుకు పెట్టాం? అనే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఖచ్చితంగా ఆడియన్స్‌కి ఒక మంచి అనుభూతినిచ్చే చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి సంబందించి మొదటి షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మిగిలిన రెండు షెడ్యూల్స్ తమిళనాడు, కేరళ, వైజాగ్ లో జరుపనున్నాం. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం.`` అన్నారు.
అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫి: జె. ప్రభాకర రెడ్డి,
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఫైట్స్: శంకర్.యు,
లైన్ ప్రొడ్యూసర్: శ్రీనిధి నక్కా,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శాని సాల్మాన్,
పి.ఆర్.ఓ: సాయి సతీష్,
నిర్మాతలు : అభినవ్ సర్ధార్,వెంకటేష్ త్రిపర్ణ,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: వెంకటేష్ త్రిపర్ణ.
తాజా వార్తలు
- AI తో ఉద్యోగాలకు ముప్పు: వెంకయ్యనాయుడు
- భారత్ రానున్న పాప్ సంచలనం షకీరా
- కార్టూనిస్ట్ శ్రీధర్ కు కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టిన ఏపీ ప్రభుత్వం
- ప్రపంచ AI హబ్‌గా భారత్..
- ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం
- చిరుత సంచారం..ప్రజల్లో భయాందోళనలు
- మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’..తొలుత ఇచ్చేది వారికే!
- సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు
- గ్యాస్ లీకేజీల పై సౌదీ సివిల్ డిఫెన్స్ వార్న్..!!
- విశాఖలో ఇంటర్నేషనల్ మారిటైమ్ రివ్యూ.. పాల్గొన్న ఒమన్..!!









