డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ `మాయ` ఫస్ట్‌లుక్‌కి సూపర్ రెస్పాన్స్
- October 14, 2020
హైదరాబాద్:ప్రవాస భారతీయురాలైన రాధికా జయంతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `మాయ`. సంధ్య బయిరెడ్డి ప్రధాన పాత్ర పోషించగా, రోహిణి కుమార్, అభిషేక్, ఐడా, మధు, మహిమా ఇతర పాత్రధారులుగా నటించారు. రేసన్ ప్రొడక్షన్స్, విఆర్ ప్రొడక్షన్స్ పతాకాలపై గోపికృష్ణ జయంతి నిర్మించారు. ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డస్టిన్ లీ ఈ చిత్రానికి వర్క్ చేయడం విశేషం. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ రాగా `మాయ`ఫస్ట్‌లుక్‌ని ఇటీవల ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదలచేశారు. ఈ ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతోపాటు సినిమా మీద క్యూరియాసిటీని పెంచి ప్రేక్షకులని ఇంప్రెస్ చేస్తోంది. ఈ సందర్భంగా..
నిర్మాత గోపికృష్ణ జయంతి మాట్లాడుతూ - ``ప్రీ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. పూర్తిగా సినిమా ఇండస్ట్రీ పట్ల ప్యాషనేట్ టీం తో కంప్లీట్‌గా అమెరికాలోని రిచ్ లొకేషన్స్‌లో `మాయ` మూవీ ని తెరకెక్కించడం జరిగింది. మేకింగ్‌లో హాలీవుడ్ ఇండస్ట్రీలో శిక్షణ తీసుకున్న రాధిక జయంతి ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డస్టిన్ లీ విజులవ్స్ తప్పకుండా ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తాయి. పలు లఘు చిత్రాలకి సంగీతం అందించిన ప్రణీత్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఈ మూవీకి తన బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీ తప్పకుండా ఆడియన్స్‌కి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ నిస్తుంది``అన్నారు.
దర్శకురాలు రాధిక జయంతి మాట్లాడుతూ - ``నిర్మాతల సహాయంతో అమెరికాలోని రిచ్‌లోకేషన్స్‌లో పూర్తి సినిమా చిత్రీకరణ జరిపాం. ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. అమెరికాలో సింగర్‌గా సుపరిచితుడు అయిన కార్తిక్ జయంతి ఈ చిత్రానికి కథ అందించారు. `మిస్ భారత్ usa ` విన్నర్ సంధ్య టైటిల్‌రోల్ పోషిస్తుండగా ఫ్యాషన్ దివా రోహిణి, అభిషేక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ తప్పకుండా ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది. త్వరలోనే టీజర్ విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
సంధ్య బయిరెడ్డి, రోహిణి కుమార్, అభిషేక్, ఐడా, మధు, మహిమా తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
కథ మరియూ రచనా సహకారం : కార్తీక్ జయంతి, వివేక్ వర్ధన్
సహాయ దర్శకత్వం : కార్తీక్ జయంతి
సినిమాటోగ్రఫి: డస్టిన్ లీ,
మ్యూజిక్ : ప‌్రణీత్,
ఎడిటింగ్: ప్రీతూ,
పిఆర్ఓ: సాయి సతీష్,
నిర్మాతలు : గోపికృష్ణ జయంతి, రోహిణి కుమార్, విజయా మోహన్
దర్శకత్వం: రాధిక జయంతి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!