'ట్రు` మూవీ టైటిల్ లోగో విడుదల!
- October 14, 2020
హైదరాబాద్:గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ నూతన నిర్మాణ సంస్థలో గుణశేఖర్, సురేందర్ రెడ్డి మరియు వై వి ఎస్ చౌదరి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన శ్యామ్ మండలని దర్శకునిగా పరిచయం చేస్తూ 'ట్రు` అనే సినిమాని నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'బైలంపుడి' మూవీ ఫేమ్ హరీష్ వినయ్, 'ఉండిపోరాదే ' ఫేమ్ లావణ్యలు హీరో, హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ మధుసూదన్ తో పాటు 'బాహుబలి ' కల్పలత, మణికంఠ, ఐ డ్రీమ్ టి ఎన్ ఆర్, డి ఎస్ రావ్, బ్రహ్మానందరెడ్డి, రూపాలక్ష్మి, గని, ఉన్నికృష్ణన్ మరియు శుభోదయం సుబ్బారావు లు నటించారు.
బేబీ అక్షిత, కుందన సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్దంగా ఉంది.
హరీష్ వినయ్, లావణ్య, మధుసూదన్, కల్పలత, మణికంఠ, ఐ డ్రీమ్ టిఎన్ఆర్, డి. ఎస్ రావ్, బ్రహ్మానందరెడ్డి, రూపాలక్ష్మి, గని, ఉన్నికృష్ణన్, శుభోదయం సుబ్బారావు తదితరులు నటిస్తోన్న
ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: శివారెడ్డి,
ఎడిటర్: జెపి,
సంగీతం: ఎమ్ జి కె ప్రవీణ్,
ఫైట్స్: శంకర్,
డాన్స్: కపిల్,
లిరిక్స్: శ్రీధర్ పల్లె, విశ్వనాథ్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జానకిరామారావు పామరాజు,
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ & డైరెక్షన్ : శ్యామ్ మండల,
నిర్మాత : కె.ఆర్,
బ్యానర్ : గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!