భారత్ - ఒమన్ సంబంధాల బలోపేతం
- February 13, 2016
ఒమన్ - భారత్ మధ్య సంబంధాలు వివిధ రంగాల్లో మరింత బలోపేతం కానున్నాయని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. వ్యూహాత్మక భాగస్వామ్యం, సంబంధాల బలోపేతం వంటి అంశాల్లో ఇరు దేశాలూ ఓ అవగాహనతో ఉన్నాయని ఇండియన్ కోస్ట్ గాడ్డ్ షిప్ సంకల్ప్ నుంచి గ్లోరియా గాంగ్టే చెప్పారు. సంకల్ప్, ఇండియాకి చెందిన అత్యాధునికమైన ఆఫ్‌షోర్ పెట్రోల్ వెస్సెల్. ఒమన్ సందర్శన కోసం వచ్చింది ఈ వెస్సెల్. ఫిబ్రవరి 16 వరకు ఒమన్ తీరంలో ఉంటుంది. డిఫెన్స్ మరియు భద్రత విషయంలో పరస్పర సహకారం అందించుకోవాలని ఇరు దేశాల డిఫెన్స్ మినిస్ట్రర్స్ మధ్య చర్చలు జరిగినట్లు గాంగ్టే చెప్పారు. ఐఎన్‌ఎస్ తరంగిణి, షాబాబ్ ఒమన్ మస్కట్ నుంచి కొచ్చిన్ వరకు గతంలో ప్రయాణించాయి. ప్రాచీన కాలంలో ఇండియా, ఒమన్‌ల మధ్య జరిగిన సముద్ర వాణిజ్యాన్ని గుర్తుకు తెచ్చాయి. గత మూడేళ్ళలో ఇండియా నుంచి ఒమన్‌కి వచ్చిన కోస్ట్‌గార్డ్ షిప్స్‌లో సంకల్ప్ మూడవది. ఇందులో 16 మంది అధికారులు, 97 మంది ఆన్ బోర్డ్ పర్సనల్ ఉంటారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







