సుప్రసిద్ధ కళా దర్శకులు ఆనంద సాయికి పవన్ కల్యాణ్ అభినందనలు
- October 16, 2020
హైదరాబాద్:యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్, ప్రముఖ కళా దర్శకులు ఆనంద సాయి ఇటీవలే ‘ధార్మిక రత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం స్వీకరించిన క్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ శుక్రవారం సాయంత్రం ఆనంద సాయిని అభినందించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఆనంద సాయిని శాలువాతో సత్కరించి – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్టతో పాలుపంచుకోవడం ప్రశంసనీయం అన్నారు. ఆలయ నిర్మాణం, సంబంధిత వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసిన ఆయనకు ధార్మిక రత్న పురస్కారం దక్కడం సముచితం అని చెప్పారు. నటులు నర్రా శ్రీను ఈ సత్కారంలో పాల్గొని అబినందనలు తెలియచేశారు.
శాంతికృష్ణ సేవా సమితి ఇటీవల హైదరాబాద్ లోని బిర్లా ఆడిటోరియమ్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఆనంద సాయి ‘ధార్మిక రత్న’ పురస్కారం స్వీకరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







