సాల్ట్ వాటర్ తో ప్రయోజనాలు..

- October 17, 2020 , by Maagulf
సాల్ట్ వాటర్ తో ప్రయోజనాలు..

చిటికెడు సాల్ట్ కూరకి ఎంతో రుచిని ఇస్తుంది. ఆ కొంచెం వేయకపోతే ఎన్ని రుచికరమైన దినుసులు వేసినా తినలేరు. అదే మరి ఉప్పుకున్నమహత్యం. ఇక బీపీ ఉన్న వారికి ఉప్పు అస్సలు వాడొద్దని చెబుతారు డాక్టర్లు. ఉప్పు ఎంత చెడ్డదో అంత మంచిది కూడా. పచ్చళ్లు నిల్వ ఉండాలంటే సరిపడినంత ఉప్పు వేయాలి. కొంచెం తక్కువైనా పచ్చడి పాడైపోతుంది. తక్కువైతే నోటికి రుచిగా కూడా అనిపించదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఉప్పు బాగా పని చేస్తుంది. అవేంటో తెలుసుకుందాం.

గోరువెచ్చని నీటిలో కొద్దిగా సాల్ట్ కలిపి తాగితే కడుపునొప్పి తగ్గిపోతుంది. ఈ వాటర్ పొట్టని క్లీన్ చేస్తుంది. అలా అని ఎక్కువ తాగితే రక్తపోటు పెరిగి ప్రమాదానికి దారి తీస్తుంది. శరీరంలో తగినంత సోడియం ఉంటే కండరాలు, నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. ఉప్పు నీటిని పుక్కిలించడం వల్ల దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల బ్యాక్టీరియా తొలగిపోతుంది. నోటి సమస్యల నివారణకు వాడే పేస్ట్ కంటే సాల్ట్ వాటర్ ఉత్తమం.

ఎండలో ఎక్కువగా పని చేసేవారు డీహైడ్రేషన్ కు గురవుతుంటారు. శరీరంలోని ఉప్పంతా ఇతర మార్గాల ద్వారా బయటకు వెళుతుంది. ఆ సమయంలో సాల్ట్ వాటర్ లో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే శరీరం మళ్లీ జీవం పుంజుకుంటుంది. స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పు వేసి చేస్తే చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. శరీర అలసటను, కాలి మడమల నొప్పులను నివారించేందుకు వేడి నీటిలో ఉప్పు వేసి పాదాలు మునిగే వరకు ఓ 20 నిమిషాల పాటు ఉంచితే రిలీఫ్ గా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com