ఏపీలో రెండు రోజులపాటు భారీ వర్షాలు

ఏపీలో రెండు రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ:భారీ వర్షాలతో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వర్షాలు, వరదలకు భారీ నష్టం జరిగింది. వరద బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరదతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔటు ఫ్లో 5 లక్షల 25 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో కృష్ణా నది వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రజలు.. బిక్కుబిక్కుమంటూ పునరావాస కేంద్రాల్లోకి తరలివెళ్లారు. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో పంటనష్టం భారీగా ఉంది. చేతికి అందివచ్చిన పంట అకాల వర్షాలకు దెబ్బ తినడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

 

Back to Top