పోస్ట్‌ కోవిడ్‌ 'రికవర్‌ క్లినిక్స్'‌ ని ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్‌

- October 20, 2020 , by Maagulf
పోస్ట్‌ కోవిడ్‌ \'రికవర్‌ క్లినిక్స్\'‌ ని ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్‌

హైదరాబాద్‌: అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ కోవిడ్‌ నుండి కోలుకున్న రోగులలో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా కనిపించే మధ్యస్థ మరియు దీర్ఘకాలిక అనారోగ్య ప్రభావాలకు సంబంధించిన సమస్యలకు వైద్య సంరక్షణను అందించేందుకుగాను  ‘పోస్ట్‌`కోవిడ్‌ రికవర్‌ క్లినిక్స్‌’ను ప్రారంభించింది. కోవిడ్‌ నుండి కోలుకున్న  నెలల తరువాత కూడా వారిలో 50% మందికి పైగా శ్వాస తీసుకోలేకపోవడం, ఛాతిలో నొప్పి మరియు గుండెకు సంబంధించిన సమస్యలు, కీళ్ల నొప్పులు, కంటికి సంబంధించిన సమస్యలు మరియు జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి పలు రుగ్మతలతో బాధపడుతున్నారు. కోవిడ్‌-19 నుండి కోలుకున్నవారిలో తిరిగి సాధారణ అరోగ్యాన్ని పునరుద్దరించడంలో న్యూరోజిస్టులు మరియు ఇమ్యునాజిస్టులు, ఒక నర్స్‌ సహాయం కలిగిన ఫ్యామిలీ ఫిజిషియన్‌తో కూడిన నిపుణుల బృందంతో ఈ రికవర్‌ క్లినిక్స్‌ పనిచేస్తాయి. పోస్ట్‌-కోవిడ్‌ రికవర్‌ క్లినిక్స్‌ జూబ్లీహిల్స్‌, హైదర్‌గూడా, సికింద్రాబాద్‌ మరియు డిఆర్‌డిఒలో ఉన్న అపోలో హాస్పిటల్స్‌లో పనిచేస్తాయి.

కోవిడ్‌-19 చికిత్స కోసం వస్తున్న రోగుల సంఖ్య ఒకవైపు క్రమేణా తగ్గుతుండగా, మరో వైపు అలసట, ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు, ఏకాగ్రత లేకపోవడం  వంటి సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు లంగ్‌ ఫైబ్రోసిస్‌, పల్మనరీ ఫైబ్రోసిస్‌ స్కార్లు ఏర్పడడంతో ఊపిరితిత్తులు సాగతీత గుణంను కోల్పోయి ఆక్సిజన్‌ను పంప్‌ చేసే సామర్ద్యాన్ని కోల్పోయి  ఊపిరితిత్తుల మార్పిడి అవసరమయ్యే, ఇస్కీమిక్‌ గుండె వ్యాధి, మెదడులో రక్తం గడ్డకట్టడంతో వచ్చే స్ట్రోకు, మూత్రపిండా సమస్య వంటి  ఒకటి లేదా అంతకంటే ఎక్కువ శరీర అవయవాలకు ఇబ్బందులను కలిగించే తీవ్రత కలిగిన మధ్యస్థ మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యులు ఎదురౌతున్నాయని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. చాలామంది రోగులు కోవిడ్‌ బారిన పడకముందు వారిలో అలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం. అంతేకాకుండా వారిలో కొంతమంది ఇప్పటికే  జీవితాంతం ప్రభావం చూపించే కోలుకోలేని పరిస్థితులలోకి వెళ్లిపోయారు. పురుషులు/స్త్రీలు అనే లింగబేధంతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారిలోనూ ఈ ధోరణి కనిపిస్తున్నది. ఒకే సమయంలో ఒకటి అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ అధిక సమస్యలతో కోవిడ్‌ బారిన పడే ప్రమాదం అధికంగా ఉన్న రోగుల రద్దీకి ఇది అదనం.

మా హాస్పిటల్స్‌లో కోవిడ్‌-19 నుండి కోలుకున్న అనేక మంది రోగుల వివిధ ఆరోగ్య సమస్యలతో మరలా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. అపోలో హాస్పిటల్స్‌ ఏర్పాటుచేసిన పోస్ట్‌-కోవిడ్‌ రికవర్‌ క్లినిక్స్‌ అటువంటి రోగులు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి.  ప్రత్యేకంగా ఏర్పాటైన ఈ క్లినిక్‌లు రోగులకు అవసరమయ్యే ప్రత్యేక వైద్య సంరక్షణను అందిస్తాయి. కోవిడ్‌-19 తదనంతర పరిణామాల నుండి రోగులు పూర్తిగా కోలుకోవడానికి తిరిగి వారు వేగంగా తమ సాధారణ జీవనం గడిపేందుకు సిద్దమయ్యేలా ఈ క్లినిక్‌ు సహాయపడతాయి’’ అని అపోలో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌, రీజినల్‌ సిఇఒ, వై సుబ్రమణ్యం అన్నారు.

కోవిడ్‌-19 శరీరంలోని దాదాపు అన్ని ముఖ్య  అవయవాలపై తన ప్రభావాన్ని చూపిస్తుంది. స్ట్రోక్‌ మరియు గుండెపోటు (మమోకార్డియల్‌ ఇన్పారక్షన్‌ - ఎమ్‌ఐ) వంటి తీవ్రమైన సంఘటనలే కాకుండా మధుమేహం మరియు రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా పోస్ట్‌-కోవిడ్‌ సిండ్రోమ్‌లో భాగం. కోవిడ్‌ నుండి కోలుకున్న రోగులలో అనేకమంది ఆకస్మిక మరణాలకు గురికావడాన్ని గమనించవచ్చు, వాటిలో అధిక భాగం గుండెకు సంబంధించిన సంఘటనలే అందుకు కారణంగా చెప్పవచ్చు.

‘‘కోవిడ్‌-19 కేవలం ఊపిరితిత్తుల మీద మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర అవయవాలపై కూడా దాడిచేసి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను సృష్టిస్తున్నది. కోవిడ్‌ తీవ్ర దశకు చికిత్స అందించిన తరువాత రోగి పూర్తిగా కోలుకుని మరియు కొన్ని వారాలు, నెల తరువాత కూడా ఆ వ్యక్తి ఆరోగ్యంపై ప్రభావం కలిగించే కొన్ని క్షణాలు బయటపడుతున్నాయి. హాస్పిటల్‌లో చేరిన రోగులలో దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తుండగా, అదే సమయంలో తేలికపాటి లక్షణాలతో కోలుకున్న రోగులలో కూడా వైరస్‌ దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తున్నది. దీర్ఘకాలిక ప్రభావాలు శరీరంపై  తీవ్రంగా ఉండడమే కాకుండా శరీరాన్ని బలహీనపరుస్తాయి. ఈ ప్రత్యేకమైన క్లినిక్స్‌ ద్వారా రోగుల లక్షణాలను అన్నివేళలా  పర్యవేక్షించడమే కాకుండా వారికి సకాలంలో వైద్య సహాయాన్ని అందించేందుకు సహాయపడతాయి. జనవరి, ఫిబ్రవరి ప్రారంభంలో కోవిడ్‌ ఇతర వైరల్‌ జ్వరాల వలె ఇది కూడా తేలికపాటి వ్యాధి అనుకున్నాము, దురదృష్టవశాత్తూ అది తప్పు అని తేలింది మరియు దానిపై నిరంతరం నేర్చుకోవాల్సివుంది. కోవిడ్‌ అనేది ఒక సార్స్‌ (సివియర్‌ అక్యూట్‌ రిస్పిరేటరీ సిండ్రోమ్‌ - తీవ్ర శ్వాసకోశ లక్షణం) సమస్య కోవిడ్‌లో శ్వాసకోశ సమస్యతో పాటు కావున 30 నుండి 35 శాతం మంది రోగులలో అలసటతో పాటు దీర్గకాలిక సమస్యలను కలిగిస్తుందని తెలిసింది, కోవిడ్‌ వలన రోగులలో కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, రుచిని కోల్పోవడం, అలసట, కుంగుబాటు, ఎక్కువ కాలం పాటు ఆందోళన వంటి పలు సమస్యలు వస్తాయి, ఇలాంటి సమస్యలకు ముందుగానే చికిత్స అవసరం. కోవిడ్‌ అనేది శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేసే వైరస్‌, మెదడులో ఏర్పడే సమస్య కారణంగా ఘ్రాణ శక్తిని కోల్పోవడం, గుండె కండరాలు బలహీనపడడం, కోవిడ్‌ పాంక్రియస్‌ గ్రంధిపై తన ప్రభావం చూపిస్తుంది కాబట్టి, కోవిడ్‌ తగ్గిపోయిన వారిలో మధుమేహం నియంత్రణ అనేది కోల్పోతుంది. కావున, రికవర్‌ క్లినిక్స్‌ అయా రోగుల సమస్య ఆధారంగా వారికి ప్రత్యేక చికిత్సను అందిస్తాయి. కోవిడ్‌ కేసులు సంఖ్య తగ్గుతున్నాయని మనం ఏమరపాటుగా ఉండకూడదు, పండుగ సీజన్‌ కొనసాగుతున్నది, తిరిగి వైరస్‌ విజృంభించే అవకాశాలు ఉన్నాయి, ప్రజలు గుమిగూడం చేయకూడదు, భౌతిక దూరం పాటించడం కొనసాగించాలి మరియు అన్ని ముందుజాగ్రత్తను తీసుకోవాలి. ఎడతెగకుండా ఇటీవల కురిసిన వానలకు అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నది.  కోవిడ్‌ మరియు డెంగ్యూ లేదా కోవిడ్‌ మరియు మలేరియా వంటి వ్యాధులు కాంబినేషన్‌ ఉండవచ్చు, ఇప్పటికే అటువంటి సూచను కనిపిస్తున్నాయి.’’ అని అపోలో హాస్పిటల్స్‌, జూబ్లీహిల్స్‌, ఇన్‌ఫెక్షియస్‌ డిసీజ్‌ - కన్సల్టెంట్‌, డా॥ సునీత నర్రెడ్డి అన్నారు.

‘‘కోవిడ్‌-19కి ముందు మొత్తం మరణాలలో 70% కారణం అవుతున్న ఎన్‌సిడి (నాన్‌ కమ్యూనికబుల్‌ డిశీజెస్‌) సునామీని ఇప్పటికే మనం ఎదుర్కుంటున్నాము. పోస్ట్‌-కోవిడ్‌ సిండ్రోమ్‌ ఈ వ్యాధి భారాన్ని మరింత పెంచుతున్నది మరియు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించక పోయినట్లయితే, కోవిడ్‌ నుండి కోలుకున్న తరువాత అత్యధిక సంఖ్యలో అనారోగ్యం పాలైన వారితో కోవిడ్‌ మహమ్మారికి మించిన అనారోగ్యాలకు మరియు మరణాలకు అది దారితీస్తుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ క్లినిక్స్‌ పోస్ట్‌-కోవిడ్‌ సిండ్రోమ్‌ మరింత పెరగకుండా చేస్తాయి మరియు రోగికి సమగ్రమైన టెలి-కన్సల్టెంట్‌ మరియు క్లినిక్‌ అధారిత ప్రోగ్రామ్‌ ద్వారా పోస్ట్‌-కోవిడ్‌ సిండ్రోమ్‌లో భాగమైన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తాయి. కోవిడ్‌ చికిత్సతో కోలుకుని ఇంటికి చేరిన రోగులు ఆకస్మికంగా మరణించడం గురించి మనం వింటున్నాము, ఇది కోవిడ్‌ సంబంధం కలిగిన రక్తం గడ్డకట్టడం కారణంగా జరుగుతున్నది, ప్రజలు తీవ్ర గుండెపోటు, స్ట్రోక్‌కు గురైతున్నప్పుడు రక్తం గడ్డకట్ట ఉండేందుకు, మేము రక్తం పలచన చేసే మందు వాడతాము.’’ అని అపోలో హాస్పిటల్స్‌, జూబ్లీహిల్స్‌, డిప్యూటి మెడికల్‌ సూపరింటెండెంట్, డా॥ రవీంద్ర బాబు అన్నారు.

ఆక్స్‌ఫర్డ్‌ ఇటీవల జరిపిన అధ్యయనంలో కోవిడ్‌ 19తో హాస్పిటల్స్‌ నుండి డిశ్చార్జ్‌ అయిన రోగులలో నెలల తరువాత కూడా వారి పలు అవయవాలలో నిరంతరం నొప్పి వంటి కొన్ని అసాధారణతలు ఉండడాన్ని గమనించారు. కోవిడ్‌ 19 వచ్చిన రెండు మూడు నెలల తరువాత కూడా 64% మందిలో శ్వాస ఆడకపోవడం, 55% తీవ్ర అలసట, ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్‌తో అలాంటి రోగులలో 60% మందిలో ఊపిరితిత్తులలో అసాధారణతలు, 29% మందిలో మూత్రపిండాల సమస్యలు, 26% మందిలో గుండెకు సంబంధించిన సమస్యలు మరియు 10% మందిలో కాలేయ సమస్యలు వంటివి ఉన్నట్లుగా వెల్లడయ్యింది.

‘‘కోవిడ్‌ లక్షణాలు మొదటి లక్షణం బయటపడిన మూడువారాల పైన కూడా కొనసాగవచ్చు. దీర్ఘకాలిక కోవిడ్‌ 19 లేదా లాంగ్‌ కోవిడ్‌ 12 వారాలకు పైనే కొనసాగుతాయి, ఇది శరీరంలోని పలు అవయవాలను ప్రభావితం చేసే వ్యాధి. రోగికి సంపూర్ణ మద్దతును అందించడం ద్వారా, రోగ లక్షణాకు తగిన చికిత్సని ఇవ్వడం, రోగికి విశ్రాంతి కల్పించడం, రోగి నెమ్మదిగా కార్యకలాపాలను ప్రారంభించేలా చేయడం ద్వారా చాలా మంది రోగులు కోలుకుంటారు. అపోలో రికవర్‌ క్లినిక్స్‌ కోవిడ్‌ అనంతర సంపూర్ణ సంరక్షణను అందిస్తాయి. రెండవ దఫా విజృంభణ అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే ఇప్పటికే ఇతర దేశాలలో ఇది జరుగుతున్నది, కావున మనం పలు జాగ్రత్తలు తీసుకోవడాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది.’’ అని అపోలో హాస్పిటల్స్‌, జూబ్లీహిల్స్‌, క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్‌, డా॥ సుబ్బారెడ్డి అన్నారు.

మొదటగా హైదరాబాద్‌, చెన్నయి, మధురై, బెంగుళూరు, మైసూర్‌, కోల్‌కతా, భువనేశ్వర్‌, గౌహతి, ఢల్లీ, ఇండోర్‌, లక్నో, ముంబయి మరియు అహ్మదాబాద్‌లలో కోవిడ్‌కు చికిత్స అందిస్తున్నటువంటి అపోలో హాస్పిటల్స్‌లో పోస్ట్‌-కోవిడ్‌ రికవర్‌ క్లినిక్స్‌ ప్రారంభంకానున్నాయి.

అపోలో హాస్పిటల్స్‌ గురించి

భారతీయ ఆరోగ్య సంరక్షణ రూపశిల్పి అయిన డాక్టర్‌ ప్రతాప్‌ సిరెడ్డి ఆధ్వర్యంలో భారతదేశంలోనే మొట్టమొదటి కార్పోరేట్‌ హాస్పిటల్‌గా అపోలో హాస్పిటల్స్‌ చెన్నైను 1983 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. 51కి పైగా హాస్పిటల్స్‌ ద్వారా 8,488 పడకలతో, 1,586 మందుల దుకాణాలతో 92 ప్రైమరీకేర్‌ క్లినిక్స్‌తోమరియు డయాగ్నస్టిక్‌ క్లినిక్‌లు, 100 టెలి మెడిసన్‌ సెంటర్లు, 15కు పైగా నర్సింగ్‌ మరియు హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ మరియు పరిశోధనా కేంద్రాలతో ఆగ్నేయాసియాలోనే మొదటిప్రోటాన్‌ థెరపీ సెంటర్‌ను చెన్నయ్‌లో ఏర్పాటు చేయడం ద్వారా ఆసియా, ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియాలోనే అతి పెద్ద సమగ్ర ఆరోగ్య సంరక్షణ సంస్థగా అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ దిన ధానాభివృద్దిని చెందుతున్నది.

ఆరోగ్య సంరక్షణ సంస్థగా అపోలో హాస్పిటల్స్‌ అందించిన గణనీయమైన తోడ్పాటుకు గుర్తింపుగా, ఒక ఆరోగ్య సంస్థకు మొదటి సారిగా భారతప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందిస్తూ ఒక స్మారక స్టాంప్‌ను విడుదల చేసింది మరియు అపోలో హాస్పిటల్స్‌ చైర్మన్‌, డా॥ ప్రతాప్‌ సిరెడ్డికి 2010 సంవత్సరంలో పద్మ విభూషణ్‌ అవార్డ్‌ను బహుకరించింది. 28 సంవత్సరాల నుండి అపోలో హాస్పిటల్స్‌ వైద్య అవిష్కరణలలో ప్రపంచస్థాయి ఆరోగ్యసేవలను అత్యాధునిక పరిజ్ఞానంతో అందిస్తున్నది. మా హాస్పిటల్స్‌ అధునాతనమైన వైద్య సేవలకు మరియు పరిశోధనలకుగాను ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ హాస్పిటల్స్‌తో సరిసమానంగా ప్రశంసలను అందుకుంటున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com